గురువు కి ప్రేమతో....

Monday,February 27,2017 - 09:15 by Z_CLU

ప్రెజెంట్ తన మ్యూజిక్ తో ఉర్రుతలూగిస్తున్న యువ సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ తన గురువు ‘మాండొలిన్ శ్రీనివాస్’ గారికి తన సంగీతంతో ప్రత్యేకమైన ఘనమైన నివాళి ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు….’గురువే నమః’ అంటూ సాగే ఈ పాటను తన గురువు ఉప్పలపు శ్రీనివాస్ గారి జయంతి సందర్భంగా ఫిబ్రవరి 28 న లహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయబోతున్నాడు దేవి. ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటు తనే స్వయంగా పాడి మాండొలిన్ కూడా వాయించాడట దేవి. జొన్న విత్తుల సంస్కృతం లో సాహిత్యం అందించిన ఈ పాటను తన గురువు కు అంకితం ఇస్తూ ఆయన పై తనకున్న ప్రేమను చాటుకోబోతున్నాడు దేవి. మరి ఈ పాటతో డి.ఎస్.పి ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి..