దేవి శ్రీ ప్రసాద్ ఆ డబ్బుతో అలా చేసాడట...

Saturday,August 20,2016 - 10:25 by Z_CLU

 

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న దేవి శ్రీ ప్రసాద్ ఇటీవలే యు.ఎస్.ఏ లో లైవ్ మ్యూజిక్ టూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ లైవ్ షో ద్వారా బాగానే డబ్బు అందుకున్నాడు దేవి. ఆ షో లు పూర్తి చేసుకొని ఇండియా తిరిగి రాగానే ఆ డబ్బంతా కంటి చూపు సరిగ్గా లేక చికిత్స పొందుతున్న అంధులకు డొనేట్ చేసేసాడట. ఇక ఇటీవలే ఈ వార్త తెలుసుకున్న టాలీవుడ్ కోలీవుడ్ సినీ ప్రముఖులు దేవి చేసిన ఈ మంచి పనికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారట. ఏదేమైనా తన సంగీతం తో ఉర్రుతలూగించే దేవి ఇలా అంధుల కోసం అంత డబ్బును డొనేట్ చెయ్యడం అభినందించాల్సిన విషయమే.