ఆ సందర్భంగా 'ధృవ' టీజర్ ?

Wednesday,August 31,2016 - 02:00 by Z_CLU

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో నటిస్తున్న తాజా చిత్రం ‘ధృవ’. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ మొదటి వారం లో విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం టీజర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 5 న విడుదల చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి యూనిట్ నుండి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోవడం తో ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే .