ప్రీ లుక్ తో క్లారిటీ ఇచ్చిన రాజశేఖర్

Wednesday,August 22,2018 - 04:07 by Z_CLU

ఇటివలే ‘గరుడ వేగ’ తో  విజయం అందుకున్న డా.రాజ‌శేఖ‌ర్ త్వరలోనే  అ! ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసింది..ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ లుక్ తో క్లారిటీ ఇచ్చేసాడు సీనియర్ హీరో.. మెగా స్టార్ చిరంజీవి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ  ప్రీ లుక్‌ను సోషల్ మీడియాలో విడుద‌ల చేశాడు రాజశేఖర్.

ప్రీ లుక్‌ పోస్టర్ లో 1983లో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ పోస్ట‌ర్‌తో చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అదే ఏడాది ఇండియా క్రికెట్‌లో వ‌ర‌ల్డ్‌క‌ప్ సాధించిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ల్డ్ క‌ప్‌ తో కపిల్ దేవ్ ను  కూడా ఈ పోస్ట‌ర్‌లో చూపిస్తూ  సినిమా 1983 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథతో తెరకెక్కనుందని క్లారిటీ ఇచ్చారు.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు సంబంధించి  ఆగ‌స్ట్ 26న రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా టైటిల్‌, ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.