'కల్కి' షూటింగ్ అప్ డేట్స్

Sunday,February 17,2019 - 11:09 by Z_CLU

ఆంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘కల్కి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటివలే బెంగుళూర్ లో కొన్ని సీన్స్ షూట్ చేసిన యూనిట్ ప్రస్తుతం బాదామి లో కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ షూట్ తర్వాత ముంబై లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు.

ఇప్పటికే 85 % షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా హైదరాబాద్ లో జరగనున్న షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ ఫినిష్ చేసుకోనుంది. మార్చ్ 20 కల్లా ఫైనల్ షెడ్యుల్ ని ఫినిష్ చేసి మే లో సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్. అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.