సాహో పెయిడ్ ప్రీమియర్స్ లేనట్టేనా?

Monday,August 26,2019 - 04:09 by Z_CLU

బాహుబలి-2కు పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటుచేశారు. చాలామంది రిలీజ్ కు ఒక రోజు ముందే బాహుబలి-2 చూశారు. సాహోకు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతారని అంతా భావించారు. కానీ ఇప్పటివరకు ఈ ఎలిమెంట్ పై క్లారిటీ లేదు. యూనిట్ కూడా ఈ యాంగిల్ లో ఆలోచించడం లేదు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, సాహో సినిమాకు సంబంధించి పెయిడ్ ప్రీమియర్స్ పెట్టే ఆలోచన చేయడం లేదు. దానికి బదులు మిడ్ నైట్ లేదా ఎర్లీ మార్నింగ్ ఓ షో ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం అది కచ్చితంగా విజయవాడ, ముంబయి, హైదరాబాద్ లోనే ఉంటుంది.

ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్-శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా బాహుబలి-2 రికార్డులు తిరగరాస్తుందని ట్రేడ్ భావిస్తోంది. మరీ ముఖ్యంగా ఫస్ట్ డే వసూళ్లపై అందరి దృష్టి పడింది. బాహుబలి-2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 42 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఇక హిందీ డబ్బింగ్ వెర్షన్ విషయానికొస్తే.. బాహుబలి-2 సినిమాదే హవా. ఈ సినిమా హిందీ వెర్షన్ కు ఇండియాలో 511 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఈ రికార్డును సాహో హిందీ వెర్షన్ అధిగమిస్తుందో లేదో చూడాలి.

ఇండియాలో భారీ వసూళ్లు (నెట్) సాధించిన టాప్-5 హిందీ డబ్బింగ్ వెర్షన్ సినిమాలివే…
బాహుబలి-2 – రూ. 511 కోట్లు
2.0 – రూ. 188 కోట్లు
బాహుబలి – రూ. 112 కోట్లు
కేజీఎఫ్ – రూ. 45 కోట్లు
కబాలి – రూ. 24 కోట్లు