డబుల్ ధమాకా ప్లాన్ చేస్తున్న సూపర్ స్టార్

Sunday,May 28,2017 - 01:01 by Z_CLU

సూపర్ స్టార్ రజిని కాంత్ అభిమానుల కోసం డబుల్ ధమాకా ప్లాన్ చేస్తున్నాడు.. ప్రెజెంట్ ఒక సినిమా ఇంకా సెట్స్ ఫై ఉండగానే మరో సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్న రజిని ఈ రెండు సినిమాలతో అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాడు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ మూవీ ‘2 .0’ సినిమాను ఆల్మోస్ట్ ఎండ్ స్టేజీ కి తీసుకొచ్చిన రజిని ఈ సినిమాను జనవరిలో థియేటర్స్ లో తీసుకురాబోతున్నాడు.. ఈ సినిమాతో పాటు పా.రంజిత్ దర్శకత్వంలో ధనుష్ నిర్మతగా రూపొందుతున్న ‘కాలా’ సినిమాను కూడా వచ్చే ఏడాదే రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు రజిని.ఈ సినిమాలో ముంబయిలో తమిళులపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటం సాగించే వ్యక్తిగా కనిపించనున్నాడు సూపర్ స్టార్. 80ల్లో ముంబయిలో మాఫియా డాన్ గా చలామణి అయిన ఓ వ్యక్తి కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్స్ తో ఇప్పటికే సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసిన రజిని ఈ సినిమాతో నెక్స్ట్ ఇయర్ మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఆశిస్తున్నాడట. సో వచ్చే ఏడాది రజిని నుంచి డబుల్ ధమాకా అందుకోబోతున్నారన్నమాట ఫాన్స్.