డబుల్ ధమాకా - 2016

Saturday,December 31,2016 - 06:00 by Z_CLU

ఏడాదికో సినిమా తో ఎంటర్టైన్ చేసే టాలీవుడ్ హీరోలు ఈ ఏడాది మాత్రం ఒకటి కంటే ఎక్కువ సినిమాలతో ఎంటర్టైన్ చేయాలని బ్లైండ్ గా ఫిక్స్ అయి టాలీవుడ్ ప్రేక్షకులకు డబుల్ ధమాకా అందించారు.. సీనియర్ హీరో నుండి జూనియర్ హీరో వరకూ కొందరు హీరోలు ఈ ఇయర్ ఓ టార్గెట్ పెట్టుకొని ఎట్టకేలకి ఆ టార్గెట్ రీచ్ అయి సక్సెస్ లు సాధించారు . టాలీవుడ్ లో ఈ ఏడాది అలా డబుల్ ధమాకా అందించిన ఆ హీరోలెవరో ఓ లుక్కేద్దాం.

 

nara-rohit

ఈ ఏడాది ఒకటి కంటే ఒక్కువ సినిమాలు చేసిన లిస్ట్ లో ముందున్నాడు నారా రోహిత్. ఏడాది కి రెండు మూడు అనే టార్గెట్ ఎప్పుడో దాటేసి ఈ ఏడాది 5 సినిమాలతో దూసుకెళ్లాడు నారా వారి అబ్బాయి. ఈ ఇయర్ మార్చ్ లో ‘తుంటరి’ సినిమాతో థియేటర్స్ లోకొచ్చిన నారా రోహిత్ ఆ వెంటనే ‘సావిత్రి’,’రాజా చేయి వేస్తే’,’జ్యో అచ్యుతానంద’,’శంకర’ సినిమాలతో వరుసగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడు. వీటితో పాటు ఇయర్ ఎండింగ్ లో ఒక ముఖ్య పాత్రలో నటించిన ‘అప్పట్లో ఒకడుండే వాడు’ సినిమా ను కూడా రిలీజ్ చేసాడు నారా వారి అబ్బాయి. అంటే 2016 లో 6 సినిమాలతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోగా మొదటి స్థానం లో ఉన్నాడు నారా రోహిత్.

 

naga-sourya-still

నారా రోహిత్ తర్వాత ఈ ఏడాది 4 సినిమాలతో రెండో స్థానం లో నిలిచాడు నాగ సౌర్య. ఈ ఇయర్ ‘అబ్బాయి తో అమ్మాయి’,’ఒక మనసు’,’కల్యాణ వైభోగమే’,’జ్యో అచ్యుతానంద’ సినిమాలతో థియేటర్స్ దగ్గర బాగానే సందడి చేసాడు ఈ కుర్ర హీరో.

 

nani

నేచురల్ స్టార్ నాని కూడా ఈ ఏడాది జెట్ స్పీడ్ తో దూసుకెళ్లాడు. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఈ ఇయర్ కూడా మూడు సినిమాలతో మూడో స్థానం లో నిలిచాడు నేచురల్ స్టార్. ఈ ఇయర్ ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’,’జెంటిల్ మెన్’,’మజ్ను’ సినిమాలతో థియేటర్స్ లో సందడి చేసి టార్గెట్ రీచ్ అయిపోయాడు నాని.

 

sunil

ఈ ఇయర్ సునీల్ కూడా మూడు సినిమాలతో నాని తో సమానంగా పోటీ పడ్డాడు.’కృష్ణాష్టమి’,’జక్కన్న’,’ఈడు గోల్డ్ ఎహె’ సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి మూడో స్థానం లో నిలిచాడు ఈ కామెడీ హీరో.

 

double-dhamaka

రెండు సినిమాలతో ఈ ఏడాది కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చాడు అక్కినేని నాగార్జున. ఇయర్ స్టార్టింగ్ లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగ్ ‘ఊపిరి’ సినిమాతో ప్రేక్షకులకు డబుల్ ధమాకా అందించి 2016 రెండు సినిమా లతో సీనియర్ హీరో గా సత్తా చాటాడు కింగ్.

 

Hero Jr NTR's Janatha Garage Movie HD New Stills

ఈ ఏడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా డబుల్ ధమాకా తో ఎంటర్టైన్ చేసి తన ఖాతలో రెండు హిట్స్ ను వేసుకున్నాడు. సంక్రాంతి బరి లో ‘నాన్న కు ప్రేమ తో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తారక్ ఈ ఇయర్ లోనే మరో సినిమాను రిలీజ్ చేసి ‘జనతా గ్యారేజ్’ తో కెరీర్ లో గ్రాండ్ హిట్ సాధించాడు.

 

naga-chaitanya

2016  అక్కినేని ఫ్యామిలీ లో నాగ్ తర్వాత  డబుల్ ధమాకా లిస్ట్ లో చైతూ కూడా ఉన్నాడు. ఈ ఇయర్ ‘ప్రేమమ్’ తో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న నాగ చైతన్య వెంటనే ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి 2016 డబుల్ ధమాకా హీరో గా నిలిచాడు.

 

ram-still

దాదాపు రెండేళ్ల నుంచి డబుల్ ధమాకా తో ఎంటర్టైన్ చేస్తున్న రామ్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో ‘నేను శైలజ’ తో అందరి కంటే ముందే హిట్ అందుకొని లేటెస్ట్ గా ‘హైపర్’ తో మరో సారి థియేటర్స్ లో అడుగుపెట్టాడు.

 

sai-dharam-tej

ఈ ఇయర్ ‘సుప్రీమ్’ తో సందడి చేసిన మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ వెంటనే మరో సినిమా ‘తిక్క’ తో థియేటర్స్ లో అడుగుపెట్టి డబుల్ ధమాకా లిస్ట్ లో చేరిపోయాడు.

 

raj-tarun

రాజ్ తరుణ్ ఈ ఏడాది ఆరంభంలో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’, సినిమాతో థియేటర్స్ లో అడుగుపెట్టి మారో సారి ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాతో సందడి చేసాడు.

 

sandeep-kishan

‘రన్’,’ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాలతో సందీప్ కిషన్ 2016 డబుల్ ధమాకా లిస్ట్ లో చేరిపోయాడు. ఈ రెండు సినిమాలతో 2016 డబుల్ ధమాకా టార్గెట్ రీచ్ అయిపోయాడు సందీప్ కిషన్.

 

aadi-garam

ఇక ఆది కూడా ‘గరం’,’చుట్టాలబ్బాయి’ సినిమాలతో 2016 లో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేసి హీరోగా జోరు పెంచేసాడు.

 

మరి వీళ్ళందరూ వచ్చే ఏడాది కూడా డబుల్ ధమాకా సినిమాలతో ఎంటర్టైన్ చేసి ఇదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తారో? లేదో చూడాలి..