దొరసాని రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,June 24,2019 - 11:40 by Z_CLU

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కిన దొరసాని సినిమా జులై 12న థియేటర్లలోకి రానుంది. మధుర ఎంటర్ టైన్మెంట్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకుంది. కె.వి.ఆర్ మహేంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

80వ దశకంలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథకు దృశ్యరూపమే ఈ దొరసాని. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ‘నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే’ పాటలు క్లిక్ అవ్వడం ఈ సినిమాకు ప్లస్. సురేష్ బాబు ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

టెక్నీషియన్స్
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
ఆర్ట్ డైరెక్టర్ : జె.కె మూర్తి
కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర
సమర్పణ: సురేష్ బాబు