హార్ట్ టచింగ్ 'దొరసాని' టీజర్

Thursday,June 06,2019 - 12:06 by Z_CLU

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోహీరోయిన్లుగా నటించిన దొరసాని టీజర్ రిలీజైంది. ఇంతకుముందే ఫస్ట్ లుక్ లో చూపించినట్టు, అంతా ఎక్స్ పెక్ట్ చేసినట్టే ఉంది టీజర్. ఓ పేద కుర్రాడికి, గడీలోని ధనిక దొరసానికి మధ్య జరిగిన అందమైన ప్రేమకథ ఇది.

80ల బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది దొరసాని సినిమా. అప్పట్లో నిజంగా జరిగిన కొన్ని ఘటనల్ని బేస్ చేసుకొని ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు మహేంద్ర. పేద కుర్రాడిగా ఆనంద్ దేవరకొండ బాగా సెట్ అయ్యాడు. అతడి యాక్టింగ్ కూడా నేచురల్ గా బాగుంది

ఇక రాజశేఖర్-జీవిత చిన్నకూతురు శివాత్మిక కూడా దొరసాని లుక్ లో బాగా కనిపించింది. కేవలం వీళ్లిద్దర్ని పరిచయం చేయడమే టార్గెట్ గా టీజర్ ను కట్ చేశారు. మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమాను సురేష్ బాబు సమర్పిస్తున్నారు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.