అఖిల్ ఈసారి కూడా అంతేనా..?

Thursday,May 09,2019 - 01:02 by Z_CLU

అఖిల్ సినిమా త్వరలో సెట్స్ పైకి వచ్చేస్తుంది. మ్యాగ్జిమం ఈ నెలలోనే సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేయాలనే  ప్రిపరేషన్స్ లో ఉన్నారు మేకర్స్. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ కోసం అదిరిపోయే కథ రాసుకున్నాడని తెలుస్తుంది. అదంతా ఓకె ఇంతకీ ఈ సినిమాతో లాంచ్ కానున్న హీరోయిన్ ఎవరు..?

ఈ సినిమాలో కూడా కొత్త హీరోయిన్ నే ఫిక్స్ చేసుకుంటారా..?  అలాగని ఎక్కడా డిస్కషన్ లేదు కానీ, లెక్క ప్రకారం ఈ సినిమాలో కొత్త హీరోయిన్ నే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే అఖిల్ చేసిన గత 3 సినిమాల్లోనూ ఫ్రెస్ ఫేసెస్ నే ప్రిఫర్ చేశారు.

‘అఖిల్’ సినిమాతో సాయేషా సెహగల్ ని ఇంట్రడ్యూస్ చేస్తే, ‘హలో’ సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ సక్సెస్ ఫుల్ డెబ్యూ అనిపించుకుంది. ఇక మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’ హీరోయిన్ కూడా ఆల్మోస్ట్ అప్పటికి కొత్తే. ఈ సినిమా కన్నా ముందే ‘సవ్యసాచి’ రిలీజయింది కానీ, దానికన్నా ముందే నిధి అగర్వాల్ ‘మిస్టర్ మజ్ను’ కి ఆల్రెడీ ఫిక్సయి పోయింది. కాబట్టి ఇప్పుడు అదే వరసలో కొత్త హీరోయిన్ నే లాంచ్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి.

కాకపోతే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ హీరోయిన్ రోల్స్ చాలా పకడ్బందీగా రాసుకుంటాడు. ఈ లెక్కన మరీ ఫస్ట్ టైమ్ కెమెరా ఫేస్ చేసే హీరోయిన్ అయితే వర్కవుట్ అవుతుందా..? కొంచెం  ఆలోచించాల్సిన విషయమే. ఈ ఆంగిల్ లో ఆలోచిస్తే, ఇప్పటికే క్రేజ్ ఉన్నహీరోయిన్ నే ప్రిఫర్ చేసే చాన్సెసే  కనిపిస్తున్నాయి. చూడాలి మరీ.. ఎప్పటిలాగే కొత్త ఫేసా..? లేకపోతే స్టార్ హీరోయినా..? ఈ సినిమా ఎవరికీ రాసి పెట్టి ఉందో…