DJ Tillu Trailer Review - కంప్లీట్ యూత్ ఫిలిం

Wednesday,February 02,2022 - 06:24 by Z_CLU

DJ Titllu టైటిల్ చూడగానే చెప్పేయొచ్చు ఇది యూత్ ని టార్గెట్ తీసిన సినిమా అని. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ అంతా యువతని బాగా ఎట్రాక్ట్ చేసింది. అయితే తాజాగా రిలీజైన ట్రైలర్ మాత్రం సినిమా మీద ఉన్న అంచనాలను అమాంతంగా పెంచేసింది. ట్రైలర్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ , సాంగ్ బిట్ , విజువల్స్ హైలైట్ నిలిచాయి.

డీజే టిల్లు అనే కుర్రాడు పబ్ లో పాటలు పాడే రాధిక అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె టిల్లుతో పాటు మరికొందరిని కూడా లవ్ చేస్తుందని తెలుసుకున్న టిల్లు ఏం చేశాడనేది కథతో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని ట్రైలర్ లో క్లియర్ కట్ గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పారు. అలాగే సినిమాలో బ్రహ్మాజీ కామెడీ హిలేరియస్ గా ఉండనుందని తెలిసేలా ట్రైలర్ లో హింట్ ఇచ్చారు.

ఓవరాల్ గా సిద్దు జొన్నల గడ్డ డిజే టిల్లు ట్రైలర్ తో మేజిక్ చేసి సినిమాపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ ని రెట్టింపు చేశాడు. సినిమాలో సిద్దు యాక్టింగ్ , నేహా శెట్టి గ్లామర్ , శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ , తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , కామెడీ ట్రాక్ హైలైట్స్ గా నిలవనున్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ట్రైలర్ ఎండింగ్ లో ఫిబ్రవరి రిలీజ్ అంటూ మాత్రమే చెప్పి డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. బహుశా త్వరలోనే మరో ఈవెంట్ పెట్టి డేట్ ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకుడు.