'డీజే' టీజర్ రిలీజ్ డేట్

Monday,February 20,2017 - 07:36 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘డీజే’ గా సందడి మొదలెట్టేశాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ మరో నాలుగు రోజుల్లో టీజర్ తో సినిమా పై అంచనాలు పెంచడానికి రెడీ అవుతున్నాడు..

హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఫుల్లెన్త్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కెరీర్ లో ఫస్ట్ టైం బాహ్మణ గెటప్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు బన్నీ. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ లో బ్రాహ్మణ గెటప్ లో మెస్మరైజ్ చేసి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన అల్లు అర్జున్ టీజర్ తో మరింత మెస్మరైజ్ చేయాలనీ చూస్తున్నాడు. ఈ నెల 24న మహా శివరాత్రి సందర్భాంగా సోషల్ మీడియా ద్వారా ఈ టీజర్ రిలీజ్ చేయాడనికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మరి ఈ టీజర్ తో బన్నీ ఎలా మెస్మరైజ్ చేస్తాడో…చూడాలి…..