DJ మొదలైంది...

Friday,November 04,2016 - 01:21 by Z_CLU

ఇవాల్టి నుండి సెట్స్ పైకి వచ్చేశాడు DJ . కాస్త గ్యాప్ తీసుకున్నా మళ్ళీ సెట్స్ పైకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న “దువ్వాడ జగన్నాథం” కోసం పెద్దగా హోమ్ వర్క్ లాంటివి చేయకపోయినా… లుక్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. సరైనోడుతో వంద కోట్ల జాబితాలో చేరిన అల్లు అర్జున్, DJ తో మళ్ళీ అదే టైప్ బ్లాక్ బస్టర్ ఖాయమని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 2 పాటలు ఫైనల్ చేశాడు దేవిశ్రీ.