కేరళలో కూడా దువ్వాడ దున్నేస్తున్నాడు

Tuesday,August 15,2017 - 11:01 by Z_CLU

బన్నీ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. వారం రోజుల్లో వంద కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడిదే సినిమా కేరళలో కూడా దుమ్ముదులుపుతోంది. ఫస్ట్ వీకెండ్ లో ఏకంగా కోటి 75లక్షల రూపాయలు వసూలు చేసింది.

బన్నీకి కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ తర్వాత బన్నీ నటించిన సినిమాలు బ్రహ్మాండంగా అడేది మల్లూవుడ్ లోనే. ఇప్పుడు డీజే సినిమా ఆ సంప్రదాయాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. కేరళలోని ప్రతి ఏరియాలో ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది.

నిజానికి ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళంలో ఒకేసారి విడుదల చేయడానికి ప్రయత్నించారు. అయితే సెన్సార్ ఫార్మాలిటీస్ లేట్ అవ్వడంతో సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది దువ్వాడ జగన్నాథమ్ సినిమా మలయాళంలో ధృవరాజా జగన్నాథ్ పేరిట విడుదలైంది. కేరళలో బన్నీ బిగ్గెస్ట్ హిట్ సరైనోడు. యోధావు పేరిట విడుదలైన ఆ సినిమా 4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇప్పుడా మూవీని డీజే క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.