DJ డబ్బింగ్ కష్టాలు

Friday,May 12,2017 - 01:08 by Z_CLU

దువ్వాడ జగన్నాథం డబ్బింగ్ సెషన్స్ ఆల్ రెడీ బిగిన్ అయిపోయాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కా బ్రాహ్మణ కుర్రాడిగా నటిస్తున్నాడు. అయితే ఈ సరికొత్త క్యారెక్టర్ ని సెట్స్ పై జీవించేసిన బన్ని, డబ్బింగ్ విషయంలో డైలాగ్ పర్ ఫెక్ట్ డిక్షన్ తో ఉంటే కానీ టేక్ ఓకె చెప్పడం లేదంట బన్ని.

పర్ఫెక్షన్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే అల్లు అర్జున్ పక్కా బ్రాహ్మణ యాసలో మాట్లాడటానికి తెగ హోం వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి తోడు డబ్బింగ్ చెప్పడానికి మార్నింగ్ బిగిన్ అయితే చీకటి పడేవరకు డబ్బింగ్ స్టూడియోలోనే గడుపుతున్నట్టు తెలుస్తుంది.

అసలే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్, దానికి తోడు రీసెంట్ గా రిలీజైన టీజర్ దానితో పాటు ఫస్ట్ లుక్స్, సరైనోడు సినిమాతో తనలోని రియల్ స్టామినాని ఎలివేట్ చేసిన బన్ని DJ పై బోలెడన్నీ  ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ ఉన్నాయి. అందుకే ఫ్యాన్స్ ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకూడదని ఫిక్స్ అయినట్టున్నాడు ఈ దువ్వాడ జగన్నాథం మునుపెన్నడూ లేని రేంజ్ లో కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.