సల్మాన్ ను క్రాస్ చేసిన బన్నీ

Saturday,June 24,2017 - 03:30 by Z_CLU

అల్లు అర్జున నటించిన దువ్వాడ జగన్నాథమ్, సల్మాన్ ఖాన్ చేసిన ట్యూబ్ లైట్ సినిమాలు రెండూ ఒకేసారి, ఒకే రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయి. అయితే ఆశ్చర్యకరంగా సల్మాన్ ఖాన్ ను బన్నీ క్రాస్ చేశాడు. కీలకమైన రెండు ఏరియాస్ లో ట్యూబ్ లైట్ సినిమాపై డీజే డామినేషన్ స్పష్టంగా కనిపించింది.

డీజే సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 18 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక ఉత్తర అమెరికాలో ఈ సినిమాకు కేవలం ప్రీమియర్స్ నుంచే 3లక్షల 50వేల డాలర్లు వచ్చాయి. కానీ సల్మాన్ నటించిన ట్యూబ్ లైట్ మాత్రం ప్రీమియర్స్ లో ఇంత సంపాదించలేకపోయింది. ఆ సినిమాకు జస్ట్ లక్షా 87వేల డాలర్లు మాత్రమే వచ్చాయి

తాజాగా వచ్చిన బాహుబలి-2 సినిమా హిందీలో నంబర్ వన్ మూవీగా నిలిచింది. సల్మాన్, షారూక్ లాంటి హీరోలు క్రియేట్ చేసిన రికార్డుల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు బన్నీ నటించిన డీజే సినిమా కూడా బాలీవుడ్ సినిమాలకు పోటీగా నిలవడం గ్రేట్.