డీజే షూటింగ్ ప్రారంభం

Thursday,October 20,2016 - 12:25 by Z_CLU

DJ సెట్ పైకి వచ్చేశాడు. దిల్ రాజు, అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పెద్ద హడావిడి లేకుండానే చిన్న పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయిపోతుంది. ఈ కార్యక్రమంలో బన్ని, అల్లు శిరీష్, హరీష్ శంకర్, దిల్ రాజు పాల్గొన్నారు.

తన ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న బన్నీ… ఈ సినిమా టైటిల్ కూడా సరికొత్తగా ఉండేలా చూసుకున్నాడు. “దువ్వాడ జగన్నాథం” అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అటు ఫాన్స్ లో, ఇటు ఫిలిం నగర్ లోను డిస్కషన్స్ మొదలైపోయాయి. ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటల కంపోజిషన్ లో పడ్డాడు. కెవ్వు కేక టైపులో అదిరిపోయే ఐటెంసాంగ్ కూడా డీజేలో ఉండబోతోంది.