Allu Arjun Pushpa - ఐటెంగాళ్ లాక్ అయింది

Thursday,May 27,2021 - 03:06 by Z_CLU

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో అదిరిపోయే ఐటెంసాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ చాలా బాగా వచ్చిందంటూ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ఊరించాడు కూడా. ఇలాంటి క్రేజీ సాంగ్ లో బన్నీతో కలిసి డాన్స్ చేయబోయే ముద్దుగుమ్మ ఎవరనే సస్పెన్స్ మొన్నటివరకు ఉండేది. ఇప్పుడా సస్పెన్స్ వీడింది.

disha patani in pushpa item song zeecinemalu 1

పుష్ప ఐటెంసాంగ్ లో బన్నీతో కలిసి డాన్స్ చేయబోతోంది దిశా పటానీ. ఈ క్రేజీ సాంగ్ కోసం ఈ బాలీవుడ్ బ్యూటీని లాక్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా దిశా పటానీ రివీల్ చేసింది. త్వరలోనే తను అల్లు అర్జున్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నానని ఆమె ప్రకటించింది.

బన్నీకి-దిశాకి మధ్య చాలా ఫిల్మీ కనెక్షన్ ఉంది. బన్నీ నటించిన దువ్వాడ జగన్నాధమ్ సినిమాలో సీటీమార్ అనే సాంగ్ ఉంది. ఈ పాటను సల్మాన్ హీరోగా నటించిన రాధే కోసం రీక్రియేట్ చేశారు. ఈ పాటలో సల్లూ భాయ్ తో కలిసి దిశా పటానీ డాన్స్ చేసింది. అంతకంటే ముందు ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలపై స్పందిస్తూ.. బన్నీతో కలిసి డాన్స్ చేయాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టింది. బన్నీ ఎలా డాన్స్ చేస్తాడో ప్రత్యక్షంగా చూడాలని ఉందని, కుదిరితే అతడితో కలిసి స్టెప్పులేయాలని ఉందంటూ చెప్పుకొచ్చింది.

disha patani in pushpa item song zeecinemalu 1

మొత్తానికి పుష్పతో ఈ అమ్మాయి కోరిక నెరవేరబోతోంది. తెలుగులో ఈమెకిది రెండో సినిమా. వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేసింది దిశా. ఆ మూవీ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే ఫిక్స్ అయిన ఈ లాంగ్ లెగ్ బ్యూటీ.. మళ్లీ ఇన్నాళ్లకు పుష్ప ఐటెంసాంగ్ తో టాలీవుడ్ లో
అడుగుపెడుతోంది.

అన్నట్టు ఈ ఐటెంసాంగ్ కోసం మొన్నటివరకు పూజాహెగ్డే పేరు వినిపించింది. అటు సుకుమార్, ఇటు బన్నీకి ఇద్దరికీ ఆమె సెంటిమెంట్ కాబట్టి, పూజా ఫిక్స్ అనుకున్నారంతా. కానీ పూజా కంటే దిశా పటానీ అయితే పాన్ ఇండియా అప్పీల్ బాగుంటుందని ఇలా ఫిక్స్ అయ్యాడు సుక్కూ.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics