శృతి హాసన్ ప్లేస్ లో వరుణ్ తేజ్ హీరోయిన్

Sunday,October 22,2017 - 01:02 by Z_CLU

చారిత్రాత్మక కథతో తెరకెక్కుతున్న ‘సంఘమిత్ర’ సినిమా నుంచి ఇటీవలే శృతి హాసన్ బయటికొచ్చేసిన సంగతి తెలిసిందే. సుందర్ .సి డైరెక్షన్ లో భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమా నుంచి శృతి హాసన్ బయటికి వచ్చి చాలా రోజులవుతుండడంతో అసలు ఈ సినిమాలో సంఘమిత్ర గా కనిపించనున్న ఆ భామ ఎవరా.. అనే క్యూరియాసిటీ నెలకొంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో సంఘమిత్ర గా దిశా పఠాని నటించబోతుందని అనౌన్స్ చేశారు మేకర్స్.

వరుణ్ తేజ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు అడిగినన్ని కాల్షీట్స్ ఇవ్వడంతో దిశాని హీరోయిన్ గా  ఫిక్స్ చేశారట . హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో జయం రవి,ఆర్య,అదితి ముఖ్య పాత్రలు పోషిస్తుండగా ఎ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.