డిస్కో రాజా రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,August 29,2019 - 04:38 by Z_CLU

అందరి అంచనాలు నిజమయ్యాయి. డిస్కోరాజా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 20న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. అలాగే సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 2 నుంచి గోవాలో కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ తళ్లూరి నిర్మాణంలో గ్రాండియర్ గా తెరకెక్కుతోంది డిస్కో రాజా.

ఈ సందర్భంగా నిర్మాత రామ్ తల్లూరి మాట్లాడుతూ… “ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఢిల్లీలోని విభిన్నమైన ప్రాంతాల్లో, లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్, హాట్ బ్యూటీ తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ హాంగులతో, గ్రాఫిక్స్ కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నాం. బాబీ సింహా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు.” అన్నారు.

న‌టీన‌టులు
ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్
ప్రొడక్షన్ – రామ్ తళ్లూరి
సమర్పణ – సాయి రిషిక
నిర్మాత : రజిని త‌ళ్లూరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫ‌ర్ : కార్తీక్ ఘట్టమనేని
డైలాగ్స్ : అబ్బూరి రవి
మ్యూజిక్ : థ‌మన్. ఎస్
ఎడిట‌ర్ : న‌వీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర. టి
కో డైరెక్టర్స్ : విజయ్ కామిశెట్టి, సురేష్ పరుచూరి
పిఆర్ఓ : ఏలూరు శ్రీను