డిస్కోరాజా ఎలా ఉన్నాడో తెలుసా?

Friday,December 06,2019 - 04:39 by Z_CLU

దర్శకుడు వీఐ ఆనంద్ సినిమాలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి డైరక్టర్ తో వర్క్ చేస్తున్న రవితేజ ఎలా కనిపించబోతున్నాడనే క్యూరియాసిటీ అందర్లో ఉంది. ఎట్టకేలకు దీనికో సమాధానం దొరికింది. డిస్కోరాజా టీజర్ రిలీజైంది.

టీజర్ చూస్తే సినిమా సైన్స్-ఫిక్షన్ జానర్ అనే విషయం అర్థమౌతూనే ఉంది. కాకపోతే ఇందులో రవితేజ పాత్ర ఏంటి, కథ ఏంటి లాంటి విషయాల్ని ఒక్క శాతం కూడా రివీల్ చేయలేదు. సినిమా మొత్తానికి ఐస్ ల్యాండ్ లో షూట్ చేసిన ఎపిసోడ్ హైలెట్ అని చెబుతున్న యూనిట్.. ఆ విజువల్స్ ను కూడా టీజర్ లో చూపించింది.

అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ల్యాబ్ సెట్ లో తీసిన షాట్స్ కూడా టీజర్ లో కనిపించాయి. రవితేజ రెట్రో గెటప్ పై ఉన్న యాక్షన్ షాట్స్ తో ఈ టీజర్ ను ఎండ్ చేశారు. తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.

జనవరి 24న భారీ స్థాయిలో డిస్కోరాజా రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత రామ్ తళ్లూరి ప్రకటించాడు. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో హీరోయిన్లు.