క్రిస్మస్ కానుకగా డిస్కోరాజా

Wednesday,August 28,2019 - 06:57 by Z_CLU

మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ క్లైమాక్స్ కు చేరుకుంది. మేకర్స్ ఇప్పుడు రిలీజ్ డేట్ పై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా క్రిస్మస్ సీజన్ లో వస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ 20న డిస్కోరాజా థియేటర్లలో హల్ చల్ చేయబోతున్నాడు.

దర్శకుడు వీఐ ఆనంద్, రవితేజ కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ. పైగా సైన్స్-ఫిక్షన్ సినిమా చేయడం కూడా రవితేజకు ఇదే ఫస్ట్ టైమ్. టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. దీనికి తోడు రవితేజ ఇందులో తండ్రికొడుకుగా డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. సినిమాకు ఇదే హై-పాయింట్.

రామ్ తళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో ఓ కీలక పాత్రలో మరో హీరోయిన్ తన్యా హోప్ కనిపించనుంది.