ఫైట్స్ చేస్తున్న డిస్కో రాజా

Tuesday,May 28,2019 - 02:12 by Z_CLU

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”. రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సెకెండ్ షెడ్యూల్ నడుస్తోంది.

సెకెండ్ షెడ్యూల్ లో హీరో రవితేజ తో పాటు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. హైద‌రాబాద్ అల్యూమినీయం ఫ్యాక్ట‌రీలో భారీగా వేసిన‌ సెట్ లో ప్ర‌స్తుతం హీరో, విలన్ మ‌ధ్య ఫైట్ సీక్వెన్సెస్ తీస్తున్నారు.

‌ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తళ్ళూరి ఈ చిత్రానికి నిర్మాత.

సాంకేతిక వ‌ర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత : రామ్ త‌ళ్లూరి
ద‌ర్శ‌కుడు : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫ‌ర్ : కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని
డైలాగ్స్ : అబ్బూరి రవి
మ్యూజిక్ : థ‌మన్
ఎడిట‌ర్ : న‌వీన్ నూలి