"డిస్కో రాజా" ఫస్ట్ లుక్ రిలీజ్

Monday,September 02,2019 - 12:39 by Z_CLU

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అలానే సెప్టెంబర్ 3 నుంచి గోవాలో కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్
చేస్తున్నట్లు నిర్మాత రామ్ తల్లూరి ప్రకటించారు.

మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ తళ్లూరి నిర్మాణంలో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఢిల్లీలోని విభిన్నమైన ప్రాంతాల్లో, లొకేషన్స్ లో షూటింగ్ చేశారు. పాయల్ రాజ్ పుత్, ఫేమ్ నభా నటేష్, తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్ నూలి ఎడిట్ ఈ సినిమాకు ప్లస్ అంటోంది యూనిట్.