డిస్కో రాజా ఫస్ట్ డే కలెక్షన్

Saturday,January 25,2020 - 04:28 by Z_CLU

రవితేజ, వీఐ ఆనంద్ ఫ్రెష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా డిస్కోరాజా. నిన్న వరల్డ్ వైడ్ రిలీజైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. రవితేజ గత సినిమాల ఓపెనింగ్స్ తో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ, అలా కంపేర్ చేసి చూడలేం. ఎందుకంటే సంక్రాంతి సినిమాల హవా ఇంకా కొనసాగుతోంది. అందుకే డిస్కోరాజాకు పెద్దగా థియేటర్లు దక్కలేదు.

ఇక బిజినెస్ విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 15 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. రిపబ్లిక్ డే హంగామాతో పాటు వీకెండ్ కూడా కలిసొచ్చింది. సో.. సోమవారం సాయంత్రానికి ఈ సినిమా మంచి నంబర్స్ పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే మొదటి రోజు వచ్చిన మిక్స్ డ్ టాక్ యూనిట్ కు కాస్త ఇబ్బందిగా మారింది.

ఇక్కడ కలిసొచ్చే అంశం ఏంటంటే.. సోమవారం నుంచి దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాలకు సంబంధించి కొన్ని స్క్రీన్స్ డిస్కోరాజాకు యాడ్ అవ్వబోతున్నాయి.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్స్
నైజాం – రూ. 1.05 కోట్లు
సీడెడ్ – రూ. 0.35 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.30 కోట్లు
ఈస్ట్ – రూ. 0.19 కోట్లు
వెస్ట్ – రూ. 0.15 కోట్లు
గుంటూరు – రూ. 0.20 కోట్లు
నెల్లూరు – రూ. 6 లక్షలు
కృష్ణా – రూ. 0.18 కోట్లు