ఫస్ట్ టైమ్ రీమేక్ చేస్తున్న డైరెక్టర్స్

Wednesday,November 20,2019 - 09:03 by Z_CLU

టాలీవుడ్ లో రీమేక్స్ కొత్త కాదు. కానీ ఈ భాషలో సక్సెస్ అయిన సినిమాని తెలుగులో రీమేక్ చేయడం ఈ డైరెక్టర్స్ కొత్తే. తమ కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఈ డైరెక్టర్స్ రీమేక్ చేస్తున్నారు.

శ్రీకాంత్ అడ్డాల : ‘అసురన్’ సినిమా రీమేక్ కి ఇతడే డైరెక్టర్. ఇప్పటి వరకు 4 సినిమాలకు దర్శకత్వం వహించాడు. తన కరియర్ లో ఇదే ఫస్ట్ రీమేక్. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల తన స్టైల్ లో ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.

కిషోర్ తిరుమల – తమిళంలో సక్సెస్ అందుకున్న ‘తడమ్’ సినిమాని రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకి తెలుగులో ‘రెడ్’ అని టైటిల్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటి వరకు సొంత కథలే తెరకెక్కించిన కిషోర్ తిరుమల… ఈ మాస్ ఎంటర్ టైనర్ ని తెలుగులో తన స్టైల్ లో తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

ప్రదీప్ కృష్ణమూర్తి – కన్నడలో సక్సెస్ అయిన ‘కవలుదారి’ సినిమా ‘కపటదారి’ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో సుమంత్ హీరో. అయితే ఈ సినిమాకి ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్టర్. ఇప్పటికే తమిళంలో 2 సినిమాలకు దర్శకత్వం వహించాడు. వాటిలో ఒకటి ‘భేతాళుడు’ గా తెలుగులో కూడా రిలీజయింది. ఇప్పుడు ఈ రీమేక్ ని తెరకెక్కించబోతున్నాడు.