పొరపాటు లేదంటున్న హీరోలు

Sunday,September 25,2016 - 12:10 by Z_CLU

కుడి-ఎడమైతే పొరపాటు లేదోయ్ అనేది క్లాసిక్ సాంగ్. ఇప్పుడు తెలుగు హీరోల విషయంలో కూడా ఈ క్లాసిక్ సాంగ్ అద్భుతంగా పనిచేస్తోంది. తమ సినిమాలకు సంబంధించి దర్శకుల విషయంలో కుడిఎడమైతే పోయేదేం లేదంటున్నారు చాలామంది హీరోలు. ఒక హీరోతో సినిమా అనుకున్న తర్వాత మరో హీరోకు కమిట్ అవుతున్నారు చాలామంది దర్శకులు. రీసెంట్ గా అలా కాంపౌండ్ మార్చిన దర్శకులు ఎవరో చూద్దాం.
mahesh-charan
రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు కొరటాల శివ. జనతా గ్యారేజ్ సెట్స్ పై ఉన్న టైమ్ లోనే ఇది జరిగింది. కానీ ఎందుకో చెర్రీ-కొరటాల ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. కట్ చేస్తే… కొరటాల ఇప్పుడు మహేష్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. గతంలో ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలానే జరిగింది. తారక్ తో సినిమా పక్కా అయిన తర్వాత… దాన్నుంచి బయటకొచ్చి మహేష్ తో శ్రీమంతుడు చేశాడు కొరటాల.
ntr-bunny
తాజాగా దర్శకుడు లింగుస్వామి విషయంలో కూడా ఇదే జరిగింది. ఈమధ్య ఎన్టీఆర్ కు ఓ స్టోరీలైన్ వినిపించాడంటూ లింగుస్వామిపై వార్తలు వచ్చాయి. అయితే సడెన్ గా అల్లు అర్జున్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు లింగుస్వామి. తెలుగు-తమిళ భాషల్లో సైమల్టేనియస్ గా తెరకెక్కనుంది ఈ సినిమా. అటు వక్కంతం వంశీ ప్రాజెక్టు కూడా ఇలానే ఊగిసలాడుతోంది. చాన్నాళ్లుగా ఎన్టీఆర్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న వక్కంతం.. ఈమధ్య మెగాకాంపౌండ్ లోకి జంప్ అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.