వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్!

Thursday,July 23,2020 - 01:44 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్స్ లో కొందరు దర్శకులు వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తూ కొత్తవారికి పని కల్పించి ప్రోత్సహించడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే నందిని రెడ్డి, సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్స్ వెబ్ సిరీస్ లు డైరెక్ట్ చేయగా దర్శకుడు క్రిష్ కూడా నిర్మాతగా మారి వెబ్ సిరీస్ కి కాన్సెప్ట్ అందిస్తున్నారు.

తాజాగా ఈ లిస్టులో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా చేరబోతున్నాడని సమాచారం. అవును సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుక్కు త్వరలోనే ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడట.

దీనికి సంబంధించి ఓ యంగ్ టీంతో సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. సుకుమార్ కాన్సెప్ట్ తో ఆయన బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. అన్ని కుదిరితే ఈ వెబ్ సిరీస్ కి సుకుమార్ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తారని అంటున్నారు.