Sujeeth Marriage: పెళ్లి చేసుకున్న సాహో దర్శకుడు

Monday,August 03,2020 - 06:06 by Z_CLU

సాహో దర్శకుడు సుజీత్ పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన ప్రవల్లికతో సుజీత్ పెళ్లి సింపుల్ గా జరిగింది. ప్రస్తుతం వీళ్ల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లాక్ డౌన్ టైమ్ లోనే ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు సుజీత్. పెళ్లి మాత్రం లాక్ డౌన్ ముగిసిన తర్వాత చేసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ పెళ్లి కూడా లాక్ డౌన్ నిబంధనలకు తగ్గట్టు సింపుల్ గా జరిగిపోయింది.

సింపుల్ గా జరిగిన ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి ఎవరెవరు ఎటెండ్ అయ్యారనే విషయంపై క్లారిటీ లేదు.