దర్శకుడు సుజీత్ పెళ్లి ఫిక్స్

Thursday,June 04,2020 - 02:57 by Z_CLU

సాహో సినిమా తర్వాత చాన్నాళ్లు ఇంటికే పరిమితమైపోయాడు దర్శకుడు సుజీత్. లాంగ్ గ్యాప్ తర్వాత తన నెక్ట్స్ సినిమాకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. చిరంజీవితో లూసిఫర్ రీమేక్ చేయబోతున్నాడు ఈ దర్శకుడు.

అయితే లూసిఫర్ రీమేక్ సెట్స్ పైకి వెళ్లడానికి టైమ్ పడుతుంది. ఆచార్య పూర్తయి, థియేటర్లలోకి వచ్చేంతవరకు లూసిఫర్ ప్రారంభం కాదు. సో.. ఈ గ్యాప్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సుజీత్. ఆల్రెడీ ఇంట్లో అతడికి ఓ సంబంధం చూసి పెట్టారు.

అమ్మాయి పేరు ప్రవళిక. హైదరాబాద్ లో డెంటిస్ట్ గా పనిచేస్తోంది. ఆమెతో సుజీత్ వివాహం త్వరలోనే జరగనుంది. ఈ నెలలోనే ఎంగేజ్ మెంట్.

సాహో డిసప్పాయింట్ చేసినా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ సుజీత్ కు అండగా నిలబడింది. త్వరలోనే అతడికి మరో సినిమా ఛాన్స్ ఇవ్వబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్ చరణ్ ను సుజీత్ డైరక్ట్ చేసే ఛాన్స్ ఉంది.