డైరెక్టర్ 'సంజన' ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ

Monday,May 28,2018 - 03:43 by Z_CLU

రాజ్ తరుణ్ హీరోగా  క్లేప్టోమేనియా కాన్సెప్ట్ తో యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన  సినిమా ‘రాజుగాడు’. ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతుంది సంజన. ప్రెజెంట్ అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు సంజన జీ సినిమాలు తో ఎక్స్ క్లూజీవ్ గా ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…

 

మ్యాథ్స్ టీచర్ నుండి డైరెక్టర్

చిన్నతనం నుండి టివీ..సినిమాలు చూడటం బాగా అలవాటు.అదే పనిగా సినిమాలు చూసే దాన్ని.. అలా చిన్నప్పటి నుండి సినిమా అంటే ఇష్టం పెంచుకున్నా. పుట్టి పెరిగింది టెక్కలి(శ్రీకాకుళం జిల్లా). ఆంధ్రా యూనివర్సిటిలో ఎం.ఎస్.సి మ్యాథమేటిక్స్ కంప్లీట్ చేసి కొన్నాళ్ళు మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేసాను. ఆ తర్వాత నేర్చుకున్నదే చెప్పడం బోర్ గా ఫీలయ్యి హైదరబాద్ వచ్చి ఫైనల్ గా డైరెక్టర్ అయ్యాను.

 

‘ఖుషి’ 27 సార్లు చూసా

నేను పదే పదే చూసిన సినిమాల్లో ‘ఖుషి’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఏప్రిల్ 27 న విడుదలైన ఆ సినిమాను 27 సార్లు చూసాను.. రోజు థియేటర్ కెళ్ళి సినిమా చూడటమే పనిగా పెట్టుకునేవాళ్ళం.  ఆ సినిమాలో ప్రతీ సీన్ బాగా అబ్సర్వ్ చేసేదాన్ని. దర్శకురాలిగా మారడానికి ఆ సినిమా కూడా ఒక కారణమే.

సినిమాలు చూసే నేర్చుకున్నా

వర్క్ ఎక్స్పీరియన్స్ కన్నా…. చిన్నతనం నుండి చూసిన సినిమాల నుండే ఎక్కువ నేర్చుకున్నా.ఆ అనుభవం నా మొదటి  సినిమాకి బాగా కలిసొచ్చింది.

 

కొన్ని కథలు విన్నా..కానీ

డైరెక్షన్ చేద్దామన్న ఆలోచన రాకముందే కొన్ని ఆడ్స్ షూట్ చేసాను… అమల గారితో చేసిన ఆడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మూవీ డైరెక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ టైంలో  వేరే వాళ్ళు రాసిన కథలు కూడా వినడం జరిగింది. కాని  అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఫైనల్ గా  క్లేప్టోమేనియా కాన్సెప్ట్ అనుకొని  కొంత మంది రైటర్స్ తో స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా చేసాం.

 

రాజ్ తరుణ్ అప్పటి నుండి క్లోజ్ అయ్యాడు

కథలు వినడం కోసం ఒక ఆఫీస్ తీసుకున్నాం. అప్పుడు రాజ్ తరుణ్ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఆఫీస్ మా ఆఫీస్ పక్కన కావడంతో అలా రాజ్ తరుణ్ పరిచయం అయ్యాడు. అప్పటి నుండి రాజ్ తరుణ్ నేను క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఇద్దరం కలిసి స్క్రిప్ట్ డిస్కర్షన్ చేసేవాళ్ళం. ఆ టైంలో ఈ కాన్సెప్ట్ అనుకొని అనిల్ గారిని అప్రోచ్ అయ్యాను. ఆయనకి పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో కొందరు రైటర్స్ తో  స్క్రిప్ట్ రెడీ చేయించారు. అలా  ఏకే ఎంటర్తైన్మెంట్స్ లోనే ఈ కథ రెడీ అయింది.


అనిల్ గారి సపోర్ట్ మర్చిపోలేను

రాజ్ తరుణ్ వల్లే అనిల్ గారు పరిచయం అయ్యారు. అనిల్ గారి సపోర్ట్ తోనే సినిమా ఇంత వరకూ వచ్చింది. ఆయన షూటింగ్ కి వచ్చింది ఒకే ఒక్క సారి మాత్రమే… ఆరోజు కొన్ని సీన్స్ చూసి  అంతా మా మీద వదిలేసి కూల్ గా వెళ్ళిపోయారు. అప్పటి నుండి మళ్ళీ సెట్ లో అడుగుపెట్టిందే లేదు. ఫైనల్ అవుట్ పుట్ చూసి ఆయన చాలా హ్యాపీ గా ఫీలయ్యారు.

 

ఏ సినిమాకి ఆదర్శం కాదు

ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి అందరూ ఇది ఏదైనా సినిమా నుండి ఆదర్శంగా తీసుకొని చేసామనుకుంటున్నారు. కాని ఇది ఏ సినిమాను ఆదర్శంగా తీసుకొని చేసిన సినిమా కాదు. సూర్య ‘మేము’ సినిమాలో క్లేప్టోమేనియా డిసార్డర్ తో ఓ క్యారెక్టర్ ఉందని విన్నాను. కానీ ఇంత వరకూ నేను ఆ సినిమా చూడలేదు.

 

మ్యూజిక్ ప్లస్ అయ్యింది 

ఈ సినిమా అనుకోగానే  గోపి సుందర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నాం.  ఆయన సాంగ్స్ తో పాటు సినిమాకు పెర్ఫెక్ట్ రీ -రికార్డింగ్ అందించారు. రిలీజ్ కి ముందే సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ‘రబ్బరు బుగ్గల’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.


అనుకోని పోటీ…

నేను పనిచేసిన ఒకే ఒక్క సినిమా ‘రౌడీ’… అనుకోకుండా రాంగోపాల్ వర్మ గారి దగ్గర ఆ సినిమాకు కొన్ని డేస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయడం జరిగింది. ఆ టైంలో అందరూ రౌడీ సంజన అంటుండే వారు. చేసింది తక్కువ రోజులే అయినప్పటికీ రాము గారి దగ్గర సినిమా మేకింగ్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నా. అయితే అనుకోకుండా ఇప్పుడు సరిగ్గా ఆయన సినిమా రిలీజ్ అవుతున్న రోజే నా సినిమా కూడా విడుదలవుతుంది. ఇది అనుకోకుండా జరిగింది. ఆయన కూడా మనం సేం డే వస్తున్నాం… అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

 

కొత్తగా ఎంటర్టైన్ చేస్తాడు

క్లేప్టోమేనియా అనే డిసార్డర్ ఉన్న కుర్రాడు ఆ సమస్య వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు.. తనకు ఎదురైన ఇబ్బందులనుండి ఎలా  ఎస్కేప్ అవుతూ తన జీవితాన్ని కొనసాగించాడు అనేది సినిమా. సినిమా అంతా ఫన్నీ గా ఉంటూనే అందరినీ కొత్తగా ఎంటర్టైన్ చేస్తుంది. ఒక్క ముక్కలో  చెప్పాలంటే ‘రాజు గాడు’ వెరీ స్పెషల్ గా ఎంటర్ టైన్ చేస్తాడు.