ఇది బూతు సినిమా కాదు, నన్ను నమ్మండి

Thursday,November 22,2018 - 05:52 by Z_CLU

24 కిస్సెస్.. టాలీవుడ్ లో ప్రస్తుతం కాంట్రవర్సీ టాపిక్ ఇదే. ఈ సినిమాలో ఇన్ని ముద్దులేంటి అంటూ ఓ సెక్షన్ మీడియా రచ్చచేస్తోంది. దీనిపై దర్శకుడు అయోధ్య కుమార్ క్లారిటీ ఇచ్చాడు. మరికొన్ని గంటల్లో మూవీ థియేటర్లలోకి వస్తుందనగా.. సినిమాపై స్పందించాడు డైరక్టర్.

“24 కిస్సెస్ అనగానే చాలా మంది ఇది బూతు సినిమా అనుకుంటున్నారు. కానేకాదు. అన్ని ఎమోషన్స్ వున్న అందమైన ప్రేమకథ. క్లీన్ ఎంటర్ టైనర్ ఫిలిం. ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండదు. మిణుగురులు లాంటి మంచి సినిమా తీసిన నా నుండి వల్గర్, బూతు సినిమా రాదు. మిణుగురులు టీమ్ నుండి వస్తోన్న మరో అద్భుతమైన చిత్రమిది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన క్లాసికల్ లవ్ స్టోరీ.”

ఇలా తన సినిమా చాలా బాగుంటుంది, అందరూ కలిసి చూడొచ్చని చెబుతున్నాడు దర్శకుడు. అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది.