నాగచైతన్యని ఇంప్రెస్ చేసిన డైరెక్టర్

Thursday,February 07,2019 - 12:37 by Z_CLU

రీసెంట్ గా రాజశేఖర్ ‘గరుడవేగ’ సినిమాతో ఇంప్రెస్ చేసిన ప్రవీణ్ సత్తారు నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నాడు. అయితే ఈసారి టాపిక్ ఇప్పటికే అనౌన్స్ చేసిన పుల్లెల గోపీచంద్ బయోపిక్ గురించి కాదు, నాగ చైతన్య తో తీయబోతున్న సినిమా గురించి. రీసెంట్ గా చైతుకి ఒక స్టోరీలైన్ చెప్పి ఇంప్రెస్ చేసాడట ప్రవీణ్ సత్తారు.

ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్ డీటేల్స్ అయితే రాలేదు కానీ, ప్రస్తుతం స్క్రిప్ట్ డిస్కర్షన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇది గనక కన్ఫమ్ అయితే ముందు ‘వెంకీ మామ’, ఆ తరవాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా, ఈ 2 సినిమాల తరవాత ఇమ్మీడియట్ గా ప్రవీణ్ సత్తారు తో సెట్స్ పైకి వస్తాడు నాగచైతన్య.

ఇకపోతే ఈ సినిమా ఏ బ్యానర్ లో తెరకెక్కుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ‘మజిలీ’ సెట్స్ పై ఉన్న చైతు,ఈ నెల 22 నుండి ‘వెంకీమామ’ సెట్స్ పైకి వచ్చేస్తాడు. ఈ సినిమా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.