ఓంకార్ నాలుగేళ్ళుగా ‘రాజుగారి గది’ లోనే...

Thursday,October 17,2019 - 10:02 by Z_CLU

ఈ క్రియేటివ్ డైరెక్టర్ ‘రాజుగారి గది’ లోంచి బయటికి రాడా..? 2012 లో ‘జీనియస్’ తో దర్శకుడిగా కరియర్ బిగిన్ చేశాడు. ఆ తరవాత చేసిన ‘రాజుగారి గది’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో ఈ బౌండరీ దాటి సినిమా ప్లాన్ చేసుకోవట్లేదు ఓంకార్. ‘రాజుగారి గది’ మంత్రం నుండి అసలు బయటికి రావట్లేదు.

నాగార్జున, సమంతా లాంటి స్టార్స్ గతంలో ‘రాజుగారి గది 2’ చేసినా ఓంకార్ పై పెద్దగా డిఫెరెంట్ ఒపీనియన్ జెనెరేట్ అవ్వలేదు. మొదటి సినిమా కాబట్టి కొత్త వాళ్ళతో కానిచ్చాడు, ఇప్పుడు సక్సెస్ తరవాత స్టార్ దర్శకుడయ్యాడు అనుకున్నారంతా. ఈ లెక్కన ఓంకార్ నెక్స్ట్ సినిమా మరో స్టార్ హీరోతో ప్లాన్ చేసుకోవాలిగా.? చేసుకోలేదు. ఎవరేమనుకున్నా తను ప్లాన్ చేసుకున్న స్ట్రాటజీనే ఫాలో అయ్యాడు. ‘రాజుగారిగది 3’ చేశాడు.

ఈ సినిమా తరవాత ఓంకార్ ఏం చేస్తాడు…? డెఫ్ఫినెట్ గా ‘రాజుగారి గది 4’ నే చేస్తాడు. ఇదే ఇప్పుడు ఆడియెన్స్ లో ఓంకార్ పై క్రియేట్ అయి ఉన్న ఇమేజ్.  ఎందుకంటే ఓంకార్ ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఈ సినిమా సీక్వెల్స్ గురించే మాట్లాడుతున్నాడు కానీ తను చేయబోయే డిఫెరెంట్ సినిమాల ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు.

‘రాజుగారి…’ సిరీస్ కి ఆదరణ లేదు అని కాదు కానీ, ఈ బౌండరీ దాటి ఓంకార్ డిఫెరెంట్ సినిమాలు చేస్తే ఎలా ఉంటాయి అనే ఆలోచన అయితే ఆడియెన్స్ లో ఉంది. మరి ఓంకార్ తన నెక్స్ట్ సినిమా విషయంలోనైనా గది దాటి బయటికి వస్తాడా..? లేకపోతే కలిసొచ్చిన ఈ సిరీస్ నే కంటిన్యూ చేస్తాడా..? చూడాలి.