మారుతి మైండ్ లో మరో టిపికల్ డిజార్డర్

Saturday,September 22,2018 - 12:03 by Z_CLU

రీసెంట్ గా ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు మారుతి. పండగ సీజన్ కి పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ అనిపించుకున్న ఈ సినిమా, మారుతి బ్రాండ్ ని ఎలివేట్ చేసింది. అయితే ఈ సినిమా చేస్తున్న హడావిడి ఇంకా తగ్గనే లేదు. అపుడే తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టేశాడు మారుతి. అయితే ఈ సినిమా కోసం కూడా ఓ ఇంట్రెస్టింగ్ డిజార్డర్ ని పిక్ చేసుకున్నాడట మారుతి.

ఇప్పటికే నానిని మతిమరుపు వ్యక్తిగా, శర్వానంద్ ను అతి శుభ్రత కలిగిన వ్యక్తిలా ఎలివేట్ చేసి, దాని చుట్టూ కావలసినంత ఎంటర్టైన్ మెంట్ ను జెనెరేట్ చేసి సూపర్ హిట్స్ కొట్టిన మారుతి, మళ్ళీ అదే ట్రాక్ లో తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఈ సినిమాలో నటించబోయే హీరో దగ్గరి నుండి బ్యానర్ డీటేల్స్వరకు ఇంకా ఏదీ బయటికైతే రాలేదు కానీ, తన గత సినిమాల్లాగే ఈ సినిమాలోను హీరో, ఓ ఇంట్రెస్టింగ్ డిజార్డర్ తో ఇబ్బంది పడతాడట. అయితే మారుతి మైండ్ లో ప్రస్తుతం డెవెలప్ మెంట్ స్టేజ్ లో ఉన్న ఆ టిపికల్ డిజార్డర్ ఏంటనేది తెలియాలంటే, ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయ్యే వరకు ఆగాల్సిందే.