డైరెక్టర్ 'మారుతి' ఇంటర్వ్యూ

Sunday,September 09,2018 - 10:09 by Z_CLU

దర్శకుడిగా తనకంటూ ఓ బ్రాండ్ బిల్డ్ చేసుకొని వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న మారుతీ లేటెస్ట్ మూవీ ‘శైలజా రెడ్డి అల్లుడు”. సెప్టెంబర్‌ 13న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంగా మారుతి మీడియాతో ముచ్చటించాడు.. ఆ విశేషాలు మారుతి మాటల్లోనే…

డిఫరెంట్‌ ఎంటర్ టైనర్ సినిమా ...

నేను తీసిన సినిమాలన్నింటిలో డిఫరెంట్‌ సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. రీరికార్డింగ్‌ తో సహా సినిమా చూశాను. దర్శకుడిగా ప్రొడక్ట్ చూసి చాలా శాటిస్ఫై అయ్యాను. సినిమా కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుంది.

కంప్లీట్‌ ఫ్యామిలీ జోనర్‌….

గతంలో వచ్చిన అత్త, అల్లుడు మధ్య జరిగే ఛాలెంజ్‌ తరహా కథ కాదిది. కంప్లీట్‌గా డిఫరెంట్‌ మూవీ. ఓ సాధారణ కుర్రాడు. శైలాజరెడ్డికి ఎలా అల్లుడయ్యాడనేదే కథ. అంతే తప్ప అల్లుడు అయిన తర్వాత నడిచే కథ కాదు. సాధారణంగా అత్త.. ఆమె కూతురితో ఉండే ఇగోయిస్టిక్‌ సమస్యలే ఈ సినిమా కథ. డైరెక్టర్‌గా ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నేను కూడా డిఫరెంట్‌ సినిమాలు చేశాను. నేను చేసిన సినిమాల్లో ఇది కంప్లీట్‌ ఫ్యామిలీ జోనర్‌. అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. నేను తీసిన సినిమాల్లో ఇది చాలా రిచ్‌గా ఉంటుంది. ఈ జోనర్‌ సినిమా నెక్స్‌ట్‌ చేయను.

నాగార్జున గారిని చూసినట్టుంటుంది

నాగ చైతన్య ని దృష్టిలో పెట్టుకొనే ఈ కథ రాసుకున్నాను. కొన్ని సీన్స్‌లో తన నటనను చూస్తే నాగార్జున గారిని చూసినట్లు అనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో.. ఫస్టాఫ్‌లో లవ్‌స్టోరి.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ స్టోరి ఉంటుంది. ఇప్పటి వరకు తను లవర్‌బోయ్‌లా నటించాడు. కానీ ఇది అలా ఉంటూనే యాక్టివ్‌గా చేశాడు. నేను రాసుకునేటప్పుడే లెవల్‌ పెంచి చేసుకుని వచ్చాడు. అలాగని ఓవరాక్షన్‌ చేయలేదు. సెటిల్డ్‌గా పర్‌ఫెక్ట్‌గా చేశాడు.

చైతన్య కి పర్ఫెక్ట్ సినిమా

నాగచైతన్యకి ఓపిక ఎక్కువ. ఎప్పుడూ పాజిటివ్‌ గానే ఆలోచిస్తాడు. తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటాడు. నాగచైతన్య బాడీ లాంగ్వేజ్‌కి పర్ఫెక్ట్ సినిమా ఇది. ఒకవేళ మనం ‘రుస్తుం’, ‘ఊరికి మొనగాడు’ అనే తరహా హీరోయిక్‌ టైటిల్‌ పెడితే తనకే నచ్చదు. సాధారణంగా అక్కినేని హీరోలు లవ్‌స్టోరీస్‌, ఫ్యామిలీ స్టోరీస్‌తో సక్సెస్‌లు సాధించారు. కాబట్టి నేను నా పరిధి దాటకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ మీద ఫోకస్‌ చేస్తూ చేసిన సినిమా ఇది. ఎంటర్‌టైనింగ్‌ సాగే సినిమా ఇది.

అక్కడే సమస్యలు మొదలవుతాయి

ఇగో అందరిలో ఉంటుంది. మనతో పాటు మనలోని ఇగో పెరుగుతుంటుంది. మనకు కావాల్సినవన్నీ దొరికితే ఎదుటి వ్యక్తి మాట వినం. అప్పుడు మనలో అహం వచ్చేస్తుంది. ఫెయిల్యూర్‌ వస్తే తట్టుకోలేం. సమస్యలు అక్కడే మొదలవుతాయి.

రమ్యకృష్ణ గారు విలన్‌ కాదు…

శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణగారు యాప్ట్‌ అనిపించారు. సాధారణంగా అత్త అల్లుడు మధ్య జరిగే కథ. అత్త విలన్‌గా ఉండటాన్ని ఎప్పటి నుండో చూస్తున్నాం. కానీ ఇది వాటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. రమ్యకృష్ణగారు ఇందులో విలన్‌గా కనపడరు. ఆమె రోల్ ఎలా ఉంటుందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


పవర్‌ఫుల్‌ నెస్‌ కోసమే…

అత్త- అల్లుడు బేస్‌ మీద సినిమా వచ్చి చాలా కాలమైంది. ఇలాంటి కథతో సినిమా చేస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. అదీగాక నాగచైతన్యలాంటి వ్యక్తి ఇది వరకు చేసిన సినిమాలకు భిన్నంగా శైలజారెడ్డి అల్లుడు అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తే కొత్తగా ఉంటుందనిపించింది. సాధారణంగా ఈ కథకు వేరే టైటిల్‌ పెట్టొచ్చు కానీ.. ఫ్యామిలీస్‌ సహా అందరికీ నచ్చేలా.. రీచ్‌ కావాలనే ఉద్దేశంతో ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ పెట్టాం. ఈ టైటిల్‌ వల్ల రమ్యకృష్ణగారికి సినిమాలో ఉండే ప్రాముఖ్యత తెలుస్తుంది. తెలుగు ప్రేక్షకులు సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చెన్నకేశరెడ్డి, నరసింహ నాయుడు వంటి సినిమాలను చూసి ఓ పవర్‌ఫుల్‌ హిట్స్‌ చేశారు. ఇక మన సినిమా టైటిల్‌లో రెడ్డి అనే పదం యాడ్‌ చేయడం వెనుక ఓ పవర్‌ఫుల్‌ నెస్‌ వస్తుందనే ఆలోచనే తప్ప మరొటి లేదు. సినిమా క్లాస్‌గా ఉంటుంది.

రియల్ క్యారెక్టరే…

అను ఇమ్మాన్యుయేల్‌ బయట ఎలా ఉంటుందో.. సినిమాలో కూడా అలాగే ఉంటుంది. సినిమాకు సూట్‌ అవుతుందనిపించింది. సినిమా చూసుకున్న తర్వాత నేను రియల్‌గా ఉన్నట్టే సినిమాలో ఉన్నానని అంది.


అందుకే ఆలస్యం..

వరదల కారణంగానే సినిమా రిలీజ్‌ ఆలస్యమైంది. కేరళకు వెళ్లాను. వెళ్లినరోజు నుండే వరదలు. తగ్గుతుందేమో అని వెయిట్‌ చేశాను. తగ్గకపోగా ఇంకా పెరుగుతూ వచ్చింది. గోపీ సుందర్‌ బంధువులు కూడా వరదల్లో చిక్కుకోవడంతో తను టెన్షన్‌ లో ఉన్నాడు. అలాంటి సమయంలో తనను ఇబ్బంది పెట్టడం సరికాదనిపించింది. అందుకే రెండు వారాలు గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు వస్తున్నాం.

నేను కూడా మారాలి…

మనకు తెలియని జోనర్‌ సినిమాలు మరుగున పడిపోతున్నాయి. ఒకప్పుడు పాలిటిక్స్‌ సినిమాలు, సోషియో ఫాంటసీ సినిమాలు ఎక్కువగా వస్తుండేవి. కానీ ఇప్పుడు రావడం తగ్గిపోయాయి. డైరెక్టర్‌గా నేను కూడా మారాలి. కొత్త జోనర్‌లో సినిమాలు చేయాలి. ఎక్స్‌పెరిమెంట్స్‌ సినిమాలు చేసి సక్సెస్‌ అయినప్పుడు కొత్తగా చేశానని అందరూ అప్రిషియేట్‌ చేస్తారు.

నిర్మాతగా విరామం తీసుకుంటా…

చిన్న సినిమాలు చేయను. నేను ఒక కథ చెప్పినప్పుడు మరొకరు బాగా డైరెక్ట్‌ చేస్తే అదొక రకం. అదే నేను కథను మరొకరితో తీయించాలనుకున్నప్పుడు అదొక రకం. వాళ్లు తీయ్చొచ్చు.. తీయలేకపోవచ్చు. వేరేవాళ్లు డైరెక్ట్‌ చేస్తున్నప్పుడు వారితో మనం కొంత దూరం మాత్రమే ట్రావెల్‌ చేయగలుగుతాం. అంతకు మించి చేయలేం. ఇక చిన్న సినిమాను నా నిర్మాణంలో చేయడం ఆపేశాను. నాతో పాటు నా టీమ్‌కు చాలా నమ్మకం ఉంటే తప్ప చిన్న సినిమాలు చేయకూడదని అనుకుంటున్నాను. తప్పులు జరుగుతున్నప్పుడు చేస్తున్న పనిని ఆపేయాలి. అదే కరెక్ట్‌.

అద్భుతం జరగాలి ..

చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా తేడా ఏం ఉండదు. నిజం చెప్పాలంటే చిన్న సినిమాకే ఎక్కువ కష్టం ఉంటుంది. ఇమేజ్‌ లేని నటీనటులు నటించిన చిత్రానికి ఆడియెన్స్‌ను రప్పించడం చాలా కష్టం. ‘ఈరోజుల్లో’ సినిమా సమయంలో ఓ ట్రైలర్‌ వేసి ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించగలిగాం. అలాంటి మేజిక్‌ జరిగితే కానీ.. ప్రేక్షకులు సినిమాకు రావడం లేదు. నిజానికి ఒక చిన్న సినిమా పెద్ద హిట్ అవ్వాలంటే అద్భుతం జరగాలి. రీసెంట్ గా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్స్ అయిన చిన్న సినిమాలే దానికి ఉదాహరణ.

తదుపరి చిత్రాలు..

గీతాఆర్ట్స్‌ , యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్ లో నెక్స్ట్ ఓ సినిమా చేస్తున్నా .. అలాగే మహేష్‌ గారి సిస్టర్‌ మంజులగారి నిర్మాణంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. విజయ్‌ దేవరకొండతో సినిమా చేయాలనే ఆలోచన కూడా ఉంది. తను కూడా ఓ సందర్భంలో నన్ను అడిగాడు. అల్లరి నరేశ్‌ తో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కామెడి సినిమా కూడా ప్లాన్ చేస్తున్నా.