Interview - దర్శకుడు మారుతి

Thursday,October 08,2020 - 07:39 by Z_CLU

చిన్న సినిమాకు పెద్ద కళ తీసుకొచ్చిన దర్శకుడు మారుతి. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం టాప్ డైరక్టర్ అనిపించుకుంటున్న మారుతి.. ఈ రోజు తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా మారుతి మనసులో మాట…

కోవిడ్ 19 లాక్ డౌన్ ని ఎలా స్పెండ్ చేశారు?

– కరోనా కారణంగా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని నా వరకు నేను క్రియేటివ్ గా మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకున్నాను. స్టోరీ డిస్కషన్స్, కొన్ని కొత్త కథలు రాసుకున్నాను. ఇంతకుముందులా ఒక స్టోరీ తరువాత మరో స్టోరీ ని రెడీ చేసే పద్ధతి నుంచి కాస్త బయట పడ్డాను, ఇప్పుడు నా చేతిలో 3-4 కథలున్నాయి, అన్ని సెట్స్ మీదకి తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కోవిడ్ ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది అని మీరు అనుకుంటున్నారు?

– ప్రొడక్షన్ పరంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, ఆడియన్స్ సినిమాలు చూడటం ఆపలేదు, కొత్త కొత్త జానర్స్ చూస్తూ ఉన్నారు, ఐతే సినిమా నిర్మాణంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి, అవి కూడా ఇప్పుడు ఓవర్ కం అయ్యి అంతా సాధారణ స్థితికి వచ్చింది అని నేను భావిస్తున్నాను.

50 పెర్సెంట్ ఆడియన్స్ తో థియేటర్స్ ని తెరవచ్చు అని ఆమోదం వచ్చింది, ఇది ఎలాంటి పరిణామంగా భావించవచ్చు?

– అసలు లేకపోవడం కంటే ముందు ఎవరో ఒకరు వచ్చి బొమ్మ వేయడం బెటర్ కదా, ఇప్పుడు 50 శాతం ఆడియన్స్ తో థియేటర్స్ నడిపించే అవకాశం దొరికింది, ఇది కచ్చితంగా శుభ పరిణామం, జనవరికి 100 శాతం ఆడియన్స్ తో థియేటర్స్ తెరిచే పరిస్థితి వస్తుంది.

మీ అప్ కమింగ్ మూవీస్ గురించి చెప్పండి

– నా మాతృ సంస్థలు యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నా. ఫిబ్రవరి నుంచి షూటింగ్ కి వెళ్తాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి, త్వరలోనే ఆ విషయాలు కూడా వెల్లడిస్తాను.

వెబ్ లోకి ఎంటర్ అవుతున్నారు అని తెలిసింది, నిజమేనా?

– ఓ వెబ్ సిరీస్ కి స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాను. ఇది ఓ కొత్త టీం చేస్తున్నారు.

ఓటిటి ల ప్రభావంతో థియేటర్స్ కి దెబ్బ అనే వాదన గురించి మీరు ఏం అంటారు?

– ఎన్ని వచ్చినా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని ఏది ఇవ్వలేదు, ఐతే OTT కారణంగా కూడా ఉపయోగాలు ఉన్నాయి, కొత్త టాలెంట్ వస్తున్నారు, కొత్త కథలు, కొత్త రకమైన ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి అందుతుంది.