Exclusive Interview మంచి సినిమా తీశాను - మారుతి

Wednesday,November 03,2021 - 05:15 by Z_CLU

హీరో సంతోష్ శోభన్  , మెహ్రీన్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచి రోజులు వచ్చాయి‘ సినిమా రేపే గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి ‘జీ సినిమాలు’తో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడాడు. ఆ విశేషాలు డైరెక్టర్ మారుతి మాటల్లోనే….

లాక్ డౌన్ లో మొదలైంది 

‘పక్కా కమర్షియల్’ షూటింగ్ గ్యాప్ లో రాసుకున్న కథ ఇది. కరోన వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయి సఫర్ అయ్యారు. దాని మీద కథ రాసుకొని సందేశం ఉండేలా చూసుకున్నాను. ఖాళీగా ఉండలేక ఒక చిన్న సినిమా చేయాలనుకున్నాను. వెంటనే యూవీతో కలిసి షూటింగ్ మొదలు పెట్టాను. అలా ఎలాంటి ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు తయారయిన సినిమా ఇది.

manchi-rojulochaie1

28 రోజుల్లోనే 

సినిమా అంతా ఒకే ఒక్క లోకేషన్ లో షూట్ చేశాం. అల్యూమినియం ఫ్యాక్టరీలో కాలనీ సెట్ వేసి అక్కడే అంతా షూట్ చేశాం. ఓ ఐదు రోజులు మాత్రమే బయటికొచ్చి సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో సీన్స్ మిగతా కొన్ని సీన్స్ తీయడం జరిగింది. మేము ప్లాన్ చేసుకున్నట్లే చాలా ఫాస్ట్ గా షూట్ అయిపోయింది. సినిమాకు వర్క్ చేసిన అందరూ చాలా సపోర్ట్ చేస్తూ కోవిడ్ టైంలో వర్క్ చేశారు.

ధైర్యమే అస్త్రం 

నా సినిమాల్లో ఇప్పటి వరకు మతి మరుపు , అతి శుభ్రత లాంటివి చూపించాను. ఈ సినిమాలో భయం అనేది ఎలా ఉంటుందో అది ఎంత డేంజర్ అనేది ఓ మెసేజ్ లా చెప్పాను. నిజానికి నా దృష్టిలో ధైర్యమే పెద్ద అస్త్రం. కరోన వచ్చినా ఎకేదో వచ్చినా ముందుగా మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి. అది ఇందులో అజయ్ ఘోష్ క్యారెక్టర్ తో చూపించాను.

పగలబడి నవ్వకపోవచ్చు…కానీ !

ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్ ని పగలబడి నవ్విస్తుంది. థియేటర్ అంతా నవ్వులతో ఊగిపోతుందని చెప్పను. కానీ నా స్టైల్ ఆఫ్ కామెడీ ని బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి కామెడీతో ఒక మంచి విషయం చెప్తూ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా తీశాను. ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టదు. సినిమాలో ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది కానీ దాని పైన ఎమోషన్ అనే లేయర్ పెద్దగా కనిపిస్తుంది.

Manchi Rojulu Vachayi movie stills zeecinemalu

మ్యూజిక్… ఎప్పుడూ జాగ్రత్త తీసుకుంటా

చిన్న సినిమా తీసినా పెద్ద సినిమా తీసినా నా సినిమాల్లో మ్యూజిక్ బాగుండేలా చూసుకుంటాను. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు మంచి మ్యూజిక్ ఉండాల్సిందే. పాటలు రిలీజ్ కి ముందే పాడుకునేలా ఉండాలి. ఆ విషయంలో ఎప్పుడూ జాగ్రత్త తీసుకున్నట్లే తీసుకున్నాను. అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్ కూడా బాగా రీచ్ అయ్యాయి. సోసో అనే పాట బాగా పాపులర్ అయింది.

అదంతా ఎక్స్ ట్రా బోనస్

సినిమా రిలీజ్ కంటే ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. అసలు వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏమిటి ?  దేన్ని నమ్ముకొని పెట్టారు ? అనేది అనేది బజ్ ఉంటుంది. ఈ సినిమా తీసింది కామన్ ఆడియన్స్ కోసం. సో వారికి ఎంత త్వరగా సినిమా చూపిస్తే అంత బాగా రీచ్ అవుతుందనే నమ్మాము.  మేము తీసిన బడ్జెట్ కి రిలీజ్ కి ముందే మాకు నాన్ థియేట్రికల్ గా వర్కౌట్ అయిపోయింది. సో మేము ఆల్రెడీ సక్సెస్ అయిపోయాం. కరోన టైంలో ఒక నూట యాబై మందికి ఈ సినిమాతో పని ఇచ్చాం. సో అందరం రిలీజ్ కి ముందే ఫుల్ హ్యాపీ. మిగతాది అంతా మాకు బోనస్ అనుకుంటున్నాం.

– అల్లు అర్జున్ ‘పుష్ప’ కొత్త స్టిల్స్

తను ఒక ఆడియన్ 

నేనూ ఎస్ కే ఎన్ ఎప్పటి నుండో మంచి ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. చాలా ఏళ్లుగా సినిమాకి బియాండ్ ఉంటూ వర్క్ చేశాడు. ఇప్పుడు బయటికొచ్చి ఒక నిర్మాతగా జర్నీ మొదలు పెట్టాడు. నా సినిమాలకు , బన్నీ వాస్ సినిమాలకు ఒక నిర్మాతగా ఉంటున్నాడు. తను ఒక నిర్మాతలా కాకుండా ఒక ఆడియన్ లా ఉంటాడు. తనలో అదే బెస్ట్ క్వాలిటీ.

పక్కా కమర్షియల్ అప్డేట్ ఇదే 

‘పక్కా కమర్షియల్’ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు అవుతున్నాయి. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతుంది. అది మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. గోపీచంద్ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకూ చూడని విధంగా గోపి క్యారెక్టర్ డిజైన్ చేశాను.


Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics