'మారుతి' బర్త్ డే ఇంటర్వ్యూ

Tuesday,October 08,2019 - 10:30 by Z_CLU

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి త్వరలోనే ‘ప్రతిరోజు పండగే’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 8న ఆయన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో స్పెషల్ ముచ్చటించాడు. ఆ విశేషాలు మారుతి మాటల్లోనే.

చాలా మంది నిర్మాతలు అడిగారు

మనం డైరెక్టర్ అవ్వాలి అనే కోరిక ‘ఈరోజుల్లో’ సినిమా తీర్చింది. నేను ఒక సినిమా డైరెక్ట్ చెయ్యగలనని ఫ్రెండ్స్ కు చూపించడానికి ‘ఈరోజుల్లో’ తీశాను, అది పెద్ద సక్సెస్ అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా మంది నిర్మాతలు సినిమాలు చెయ్యమని అడిగారు, అలా వరుగగా సినిమాలు చేస్తూ వచ్చాను.

ఎమోషన్స్ తో పాటు ఎంటర్త్సైన్మెంట్

సమాజంలో జరుగుతున్న అంశాలను తీసుకొని నా తరహాలో దానికి ఎంటర్త్సైన్మెంట్ జోడించి సినిమాలు తీశాను సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం చేస్తున్న ‘ప్రతిరోజు పండగే’ లో ఎమోషన్స్ తో పాటు ఎంటర్త్సైన్మెంట్ ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ కు ముందు ఈ కథ లైన్ చెప్పాను. నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ వినిపించాను. సాయి కెరీర్ లో ఇది డిఫరెంట్ సినిమా అని చెప్పవచ్చు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్త్సైన్మెంట్ సబ్జెక్ట్ ఇది.

 

అరవింద్ గారికి కథ నచ్చింది

ప్రతిరోజు పండగే సినిమా కథను ముందుగా యు.వి.క్రియేషన్స్ వంశీ గారికి చెప్పాను. వంశీ గారికి కథ బాగా నచ్చింది, ఈ సబ్జెక్ట్ డెవలప్ చేస్తున్న ప్రాసెస్ లో అల్లు అరవింద్ గారికి డిటెయిల్ గా నరేట్ చేశాను. అరవింద్ గారికి కథ నచ్చింది అలా ‘గీత ఆర్ట్స్ 2’ లో ఈ సినిమాను ప్రారంభించాము.

 

కనెక్ట్ అయ్యే చాలా అంశాలున్నాయి

మనిషి పుట్టినప్పుడు సంతోషంగా సెలెబ్రెట్ చేసుకుంటారు. కానీ మనిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతన్ని మానసికంగా సంతోష పెడితే మరిన్ని ఎక్కువ రోజులు బ్రతుకుతాడానే విషయాన్ని ఎంటర్త్సైన్ గా చెప్పాము. ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే చాలా అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి.

ప్రకృతికి దగ్గరగా ఉండే కథ

‘ప్రతిరోజు పండగే’ సినిమాను రాజమండ్రి లో కొన్ని రోజులు షూట్ చేశాం. ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ కథ కోసం పచ్చని పొలాల్లో కీలక సన్నివేషాలు చిత్రీకరించడం జరిగింది. సినిమాలు ఐదు పాటలు ఉన్నాయి. థమన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. సత్యరాజ్ గారి నటన సినిమాకు ఆదనవు ఆకర్షణ కానుంది.

డిసెంబర్ రెండో వారంలో

ప్రతిరోజు పండగే ఎనభై శాతం చిత్రీకరణ పూర్తి అయింది. అమెరికాలో ఐదు రోజులు షూట్ చెయ్యాలి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నాము. సినిమా ఔట్ ఫుట్ తో మేము హ్యాపీగా ఉన్నాము. డిసెంబర్ రెండో వారంలో ఫస్ట్ కాపీ సిద్ధం అవుతుంది. విడుదల తేదీని నిర్మాతలు అల్లు అరవింద్ గారు, బన్నీ వాసు గారు ప్రకటిస్తారన్నారు.