VaruduKaavalenu డైరెక్టర్ లక్ష్మి సౌజన్య ఇంటర్వ్యూ

Monday,October 25,2021 - 03:14 by Z_CLU

నాగ శౌర్య , రీతువర్మ జంటగా తెరకెక్కిన ‘వరుడు కావలెను‘ రిలీజ్ కి రెడీ అయింది. ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజవుతున్న ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతుంది. సినిమా విడుదల సందర్భంగా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆవిడ మాటల్లోనే..

ఆ మూడు అనుకున్నాను కానీ ఫైనల్ గా 

చిన్నతనం నుండి నాకు అందరిలో ఒకమ్మాయిగా గుంపులో ఉండటం ఇష్టం లేదు. మనకంటూ సెపరేట్ గుర్తింపు ఉండాలని, గుంపులో ఉండకూడదనే మెంటాలిటీ నాది. అందుకే కాలేజీ డేస్ లోనే సినిమా .. క్రీడా , రాజకీయ రంగంలో ఈ మూడిటిలో ఏదో ఒకటి ఎంచుకొని అందులో రాణించాలని అనుకున్నాను. కానీ ఫైనల్ గా సినిమా రంగం ఎంచుకొని నాకు ఇదే కరెక్ట్ అని భావించి హైదరాబాద్ వచ్చి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో జాయిన్ అయ్యాను. నేను డైరెక్ట్ చేసి యాడ్ ఫిలిం చూసి తేజ గారు ఆయనతో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత కృష్ణ వంశీ గారి దగ్గర క్రిష్ గారి దగ్గర వర్క్ చేశాను.

Varudu Kaavalenu nagashaurya ritu varma

ఇరు వైపులా నుండి చెప్పే కథ 

సినిమా టీజర్ , ట్రైలర్ చూసి ఇది అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పే కథ అనుకుంటున్నారు. కథ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మొదలవుతుంది కానీ చివరికి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎండ్ అవుతుంది. సో కథలో ఇద్దరివీ సమానమైన పాత్రలే. అబ్బాయిలకు అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది. ఎలా ఉంటే అమ్మాయిలకు నచ్చుతారో తెలుస్తుంది. అలాగే అమ్మాయిలకు అబ్బాయిల వెర్షన్ కూడా తెలిసేలా ఉంటుంది. రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఈ కథ చెప్పాను.

నాలుగేళ్ళు పట్టింది

కొన్నేళ్ళ క్రితమే ఈ కథ రెడీ చేసుకున్నాను. కొందరు యంగ్ హీరోలకు, నిర్మాతలకు చెప్పాను. అందరికీ నచ్చింది. కానీ ఎందుకో కుదరలేదు. ఫైనల్ గా రాదా కృష్ణ గారికి చెప్పడం అయన మనం చేద్దాం అని మాట ఇవ్వడం జరిగింది. నాలుగేళ్ళు ఆయన బేనర్ లోనే ఉండిపోయి ఈ సినిమా చేశాను. రాధా కృష్ణ గారి సపోర్ట్ , ఎంకరేజ్ మెంట్ , రెస్పెక్ట్ సూపర్బ్.  స్క్రిప్ట్ విన్న దగ్గరి నుండి ఇప్పటి వరకూ ఆయన సపోర్ట్ మర్చిపోలేను. ఆయన ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఇన్నేళ్ళ నా జర్నీ లో నేను చూసిన వ్యక్తుల్లో ఆయన బెస్ట్ అనిపించారు. ముఖ్యంగా సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ నాకు బాగా నచ్చింది.

నాగ శౌర్య కి యాప్ట్ 

ఆకాష్ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు యంగ్ హీరోలను దృష్టిలో పెట్టుకొనే రాసాను. కానీ శౌర్య ని అప్రోచ్ అయ్యే ముందే తనకి ఇది యాప్ట్ క్యారెక్టర్ అనిపించింది. adhi ఎందుకనేది సినిమా రిలీజ్ తర్వాత మీకే తెలుస్తుంది. ఆకాష్ క్యారెక్టర్ కి శౌర్య బెస్ట్ ఇచ్చాడు. ఈ సినిమాతో తను ఫ్యామిలీ కి ఇంకా ఎక్కువ రీచ్ అవుతాడని అనుకుంటున్నాను. అలాగే భూమి పాత్రలో రీతు వర్మ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. తనకి మంచి పేరు తీసుకొచ్చే క్యారెక్టర్ అవుతుంది.

varudu kaavalenu

అందుకే ఆ బాధ్యత తమన్ గారికి 

సినిమాలో ఓ సందర్భంలో మంచి ఫోక్ సాంగ్ కావాలనుకున్నాం. సాంగ్ బాగా రీచ్ అయ్యేలా కంపోజ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ కోసం చూశాం. అందుకే ఆ సాంగ్ ని తమన్ గారిలో చేతిలో పెట్టాం. ఆ పాటతో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు బాగా ఉపయోగపడింది. అలాగే ఇంకో సిచ్యువేషణ్ లో వచ్చే సాంగ్ కూడా తమన్ గారితోనే కంపోజ్ చేయించాం.  విశాల్ చంద్ర మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయింది. కోల కళ్ళే ఇలా సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు హైలైట్ అనిపిస్తుంది.

varudukavalenu-Dubbing-started-zeecinemalu

ఎంజాయ్ చేస్తున్నా

డైరెక్టర్ గా మొదటి సినిమా కాబట్టి కొంచెం టెన్షన్ ఉంది. కానీ ఈ ఫేజ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కొంచెం టెన్షన్ ఎక్కువ ఎంజాయ్ ఇలా ఉంది నా పరిస్థితి. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఆ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాను.

– Pooja Hegde at varudu Kavalenu Sangeeth event

నెక్స్ట్ కథ రెడీ

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనే నెక్స్ట్ సినిమా కోసం ప్రొడక్షన్ హౌజ్ ల నుండికాల్స్ వచ్చాయి. త్వరలోనే నెక్స్ట్ సినిమా వివరాలు చెప్తాను. ఐడెంటిటీ కాన్సెప్ట్ మీద స్టోరీ రాసుకున్నాను అదే కథతో చేయబోతున్నాను.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics