పవర్ స్టార్ అయినా పద్ధతి మార్చుకోని దర్శకుడు

Tuesday,January 28,2020 - 03:14 by Z_CLU

క్రిష్ తన స్టైల్ మార్చుకోలేదు. మామూలుగా పవన్ కళ్యాణ్ తో సినిమా అనగానే వీళ్ళిద్దరి కామిబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందోనన్న క్యూరియాసిటీ నేచురల్ గా క్రియేట్ అవుతుంది. అయితే ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో కథనెంచుకుని సినిమా ఏ స్టార్ తో చేసినా ప్రస్తుతానికి స్టైల్ లో మాత్రం నో చేంజ్ అనిపించుకున్నాడు క్రిష్.

 ‘కంచె’ నుండి బిగిన్ అయితే క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణీ, ఆ తరవాత NTR బయోపిక్ అంతెందుకు బాలీవుడ్ లో కూడా ‘మణికర్ణిక’ చేసి, ఆల్మోస్ట్ కొన్నేళ్లుగా హిస్టరీలోనే ట్రావెల్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరవాత చిన్న బ్రేక్ తీసుకుని కథని సిద్ధం చేసుకున్నా కలిసొచ్చిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ని ఏ మాత్రం పక్కన పెట్టలేదు క్రిష్.

ఈ సినిమాతో పవర్ స్టార్ ని కూడా హిస్టరీలోకి తీసుకెళ్ళబోతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది ఫీస్ట్ లాంటి న్యూసే. ప్రస్తుతానికయితే ఈ సినిమాలో హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయని తెలుస్తుంది.

ప్రస్తుతానికయితే ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న మేకర్స్ వీలైనంత త్వరలో సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.