Shriya Pan India Movie - 'గ‌మ‌నం' ఫ‌స్ట్ లుక్

Friday,September 11,2020 - 04:28 by Z_CLU

గ్లామర్, యాక్టింగ్ టాలెంట్ క‌ల‌బోసిన న‌టీమ‌ణుల్లో ముందు వ‌రుస‌లో ఉండే తార శ్రియా. అందుకే దాదాపు రెండు ద‌శాబ్దాలైనా ఇప్పటికీ శ్రియ క్రేజ్ తగ్గలేదు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్న శ్రియ, తాజాగా గమనం అనే మూవీ చేసింది.

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. Shriya Birthday సంద‌ర్భంగా ఈరోజు ‘గ‌మ‌నం’ ఫిల్మ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ విడుద‌ల చేశాడు.

మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్న జ్ఞాన‌శేఖ‌ర్… నిర్మాత అవ‌తారం కూడా ఎత్తి, ర‌మేష్, వెంకీల‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

షూటింగ్ మొత్తం పూర్త‌యిన ‘గ‌మ‌నం’ (Gamanam) చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.