NTR30 ఫస్ట్ లుక్ ఎప్పుడంటే ?

Wednesday,April 27,2022 - 07:23 by Z_CLU

Director Koratala Siva gives a clarity on NTR30 Update

ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబో సినిమా ఎనౌన్స్ అయినప్పటి నుండి ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ క్రేజీ కాంబో మూవీ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. సినిమా ఎప్పుడు మొదలవుతుంది ? ఎప్పుడు రిలీజ్ అనేవి తెలుసుకోవాలని చూస్తున్నారు తారక్ ఫ్యాన్స్. అసలు ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుంది ? అనేది కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది.

తాజాగా వీటన్నిటికి జవాబిచ్చాడు కొరటాల. మరో పది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫైనల్ డిస్కషన్స్ పూర్తవుతాయని జూన్ లో షూటింగ్ అనుకుంటున్నామని తెలిపాడు. ఇక ఈ మూవీ నుండి వచ్చే ఫస్ట్ అప్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు కొరటాల. “మే 20 తారక్ బర్త్ డే ఉంది కదా చూద్దాం” అంటూ ఇన్ డైరెక్ట్ గా ఏదో ఒక అప్ డేట్ రావడం పక్కా అని చెప్పకనే చెప్పాడు.

ఈ అప్ డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవ్వడం ఖాయం. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వని ఈ సినిమా నుండి బర్త్ డే కి లుక్ వస్తుందా ? లేదా అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. మరి కొరటాల ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics