'డైరెక్టర్ డైమండ్ రత్నబాబు' ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Wednesday,June 26,2019 - 06:03 by Z_CLU

దాదాపు 15 సినిమాలకు రచయితగా పనిచేసిన రైటర్ డైమండ్ రత్నబాబు ‘బుర్ర కథ’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆది హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు డైమండ్ రత్నబాబు ‘జీ సినిమాలు’ తో ముచ్చటించాడు. ఆ విశేషాలు రత్నబాబు మాటల్లోనే…

ఆలోచన అలా పుట్టింది

సక్సెస్ ఫుల్ రైటర్ గా ఉంటూ దర్శకుడిగా మారాలంటే ఒక మంచి కథ దొరకాలి.ఇండస్ట్రీకి వచ్చినప్పుడే డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. గాయత్రి సినిమా తర్వాత ఈ పాయింట్ స్ట్రైక్ అయింది. ఒక ఫోన్ లో రెండు సిమ్ లున్నట్టుగా ఒక మనిషికి రెండు బుర్రలుంటే…?అనే ఆలోచన నుండి బుర్రకథ పుట్టింది. నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరిలో ఒకడు బాగా అల్లరి చేస్తే మరొకడు సైలెంట్. అలా రోజు వాళ్ళిద్దరినీ గమనించి, అలాగే కొంత రీసెర్చ్ చేసి అభిరాం క్యారెక్టర్ రాసుకున్నాను. ఆ క్యారెక్టర్ లో ఉండే షేడ్స్ ప్రతీ కుటుంబంలో ఉండేవి. కాకపోతే దానికి సైన్టిఫిక్ అంశాన్ని జోడించానంతే.

అందరూ అదే అడిగారు

ఈ కథను కొందరు నిర్మాతలకు వినిపించాను. విన్న వెంటనే ఇది కొరియన్ సినిమాలో పాయింట్ ఆ..లేదా హాలీవుడ్ సినిమాలో పాయింట్ అని అడిగేవారు.అలా అడిగిన ప్రతీ సారి ఇది నా సొంత కథ అంటూ చెప్పుకొచ్చాను. కొందరైతే ఈ కథాంశంతో సినిమా వచ్చిందా..? అని గూగుల్ లో సెర్చ్ చేసుకున్నారు. ‘ఏ మెన్ విత్ టూ బ్రైన్స్’ అనే పోస్టర్ చూసి నేను చెప్పిన కథ అదే అనుకున్నారు. కానీ అది స్పిర్ట్ పర్సనాలిటీ కథతో తెరకెక్కిన సినిమా. ఆ కథతో తెలుగు తమిళ్ లో సినిమాలొచ్చాయి. కానీ ఈ పాయింట్ తో ఇంత వరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ పాయింట్ తో సినిమా తీసినందుకు హ్యాపీ గా ఉంది.

 

‘ఆది’ని సజిస్ట్ చేసింది ఆయనే

కొందరు నిర్మాతలకు కథ చెప్పాను. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా దీపాల ఆర్ట్స్ శ్రీకాంత్ గారికి చెప్పాను. ఆయనకీ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఆది ని ఆయనే సజిస్ట్ చేశారు.ఆ తర్వాత ఆది కి కథ చెప్పడం తనకి కూడా ఎగ్జైటింగ్ గా అనిపించడంతో సినిమా స్టార్ట్ చేసేశాం.

ఆది కి మంచి పేరొస్తుంది

నిర్మాత ఆది పేరు చెప్పగానే నాకు కూడా కథకి తను పర్ఫెక్ట్ అనిపించింది. మాస్ , క్లాస్ రెండూ చేయగలడని అనిపించింది. నటనతో పాటు మంచి వాయిస్ కూడా ఉన్న హీరో. ముఖ్యంగా ‘శమంతకమణి’ సినిమాలో ఆది నటన నాకు బాగా నచ్చింది. మేము అనుకున్నట్లే ఆది అభిరాం పాత్రకి బెస్ట్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆది కి ఇంకా మంచి పేరొస్తుంది.

టైటిల్ క్రెడిట్ అతనికే

ఈ కథకి ముందుగా వీడు క్లాసు -వాడు మాస్, హలో బ్రదర్ అనే టైటిల్స్ అనుకున్నాను. కానీ నా దగ్గర పనిచేసే ప్రసాద్ కామినేని అనే కుర్రాడు బుర్రకథ అని ఈ టైటిల్ చెప్పాడు. కథకి యాప్ట్ టైటిల్ అనిపించింది. వెంటనే అతనికి ఓ చెక్ రాసి ఇచ్చాను. టైటిల్ క్రెడిట్ అతనికే.

‘మణికర్ణిక’ సమయంలో

‘మణికర్ణిక’ సినిమా టైంలో ఆది మిష్టి ని రిఫర్ చేసాడు. నాకు కూడా హ్యాపీ క్యారెక్టర్ కి సూటవుతుందని అనిపించింది. వెంటనే ఫైనల్ చేసాం. సినిమాలో తన క్యారెక్టర్ కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది.

పది వెర్షన్స్ రాయోచ్చు

పుట్టుకతోనే రెండు బుర్రలున్న పాయింట్ తో పది వెర్షన్స్ రాసుకోవచ్చు. అందులో నేను ఎంటర్టైన్ మెంట్ ఎంచుకున్నాను. కథ ఎలాగున్నా సినిమాలో అన్నీ ఉండాలనుకునే ఆలోచన నాది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా హిలేరియస్ ఎంటర్టైన్ గా తెరకెక్కించాను. బాలీవుడ్ లో కూడా ఈ పాయింట్ తో సీరియస్ సినిమా చేయొచ్చు. ఆల్రెడీ సోనీ వాళ్ళను సంప్రదించడం జరిగింది.

విందుభోజనం

నేను డైరెక్ట్ చేసిన సినిమా చూస్తూ ప్రేక్షకుడు విందు భోజనంలా ఫీలవ్వాలి. నా సినిమాలో మంచి కథ -కథనం , పాటలు, కామెడీ , యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ ఇలా అన్నీ ఉండాలనుకుంటాను. బుర్రకథలో ఇవన్నీ ఉంటాయి. ప్రేక్షకుడికి థియేటర్ లో విందు భోజనమే.

అది ట్రైలర్ కోసమే

పృథ్వీ గారి కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే సినిమాలో ఆయనకీ ఓ ట్రాక్ రాసి ప్రేక్షకులను బాగా నవ్వించాలనుకున్నాను. ట్రైలర్ లో ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ చెప్పింది జస్ట్ ట్రైలర్ కోసం షూట్ చేసాం. సినిమాలో అది ఉండదు. సినిమాలో ‘అరవింద సమెత’ డైలాగ్ స్పూఫ్ కామెడీ ఉంటుంది. దానికి విపరీతంగా ఎంజాయ్ చేస్తారు.


కెమిస్ట్రీ బాగా కుదిరింది

సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ – రఘువరన్ ఫ్రెండ్షిప్ నాకు చాలా ఇష్టం. తండ్రి కొడుకుల మధ్య ఒక ఫ్రెండ్షిప్ ని ఆ సినిమాలో బాగా చూపించారు. బుర్రకథలో ఆది, రాజేంద్ర ప్రసాద్ మధ్య ఫ్రెండ్షిప్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ కెమిస్ట్రీ బాగా కుదిరింది. వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకి కనెక్ట్ అయితే సినిమా పెద్ద హిట్.

మోహన్ బాబు గారికి చెప్పాను

సినిమా స్టార్ట్ అవ్వకముందే ఈ కథ మోహన్ బాబు గారికి చెప్పాను.ఆయనకి బాగా నచ్చింది. మన బ్యానర్ లో చేసుకోవచ్చు కదా అని అన్నారు. మన ప్రొడక్షన్ లో ఎప్పుడైనా సినిమా ఉంటుంది…కానీ మొదటి సినిమా బయట చేసి ప్రూవ్ చేసుకొని వస్తానంటూ ఆయనతో చెప్పడం జరిగింది. ఆల్ ది బెస్ట్ అన్నారు. మోహన్ బాబు గారి బ్యానర్ అంటే నాకు హోమ్ బ్యానర్.. ఆ బ్యానర్ లో దర్శకుడిగా సినిమా చేస్తాను. అదెప్పుడనేది ఇంకా తెలియదు.

డైరెక్టర్ గా సక్సెస్

‘బుర్రకథ’ టీజర్ రిలీజ్ అవ్వగానే ఓ ఇద్దరు నిర్మాతలు ఫోన్ చేసి మీ సినిమా హిట్ , ఫ్లాప్ తో సంబంధం లేదండీ నెక్స్ట్ సినిమాకి అడ్వాన్స్ తీసుకోండి అన్నారు.అక్కడే డైరెక్టర్ సక్సెస్ అయ్యానని అనిపించింది.అలాగే వింటేజ్ శివరామకృష్ణ గారు ఈస్ట్ కొందామని వచ్చి సినిమాలో నాలుగైదు సీన్స్ చూసి మొత్తం నేనే కొనుక్కుంటానంటూ తీసుకొని రిలీజ్ చేస్తున్నారు.

రాసే వాడే తీస్తే….

రైటర్ అనే వాడు తను రాసుకున్న కథని ఎంతో ప్రేమిస్తాడు. ఆ కథలో దర్శకుడు ఏదైనా మార్పులు చేస్తే మనసు చివుక్కు మంటది. రాసి వాడే తీస్తే… ఆ బొమ్మ వేరేలా ఉంటుంది.ఇప్పుడొస్తున్న యంగ్ డైరెక్టర్సే దానికి నిదర్శం. అవన్నీ పక్కన పెడితే… ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామనే వచ్చాను కాబట్టి కేవలం రైటర్ లానే కాకుండా డైరెక్టర్ లా ట్రావెల్ చేసేవాణ్ణి.

 

కొత్త కథలు రావాలి

‘బుర్రకథ’ సినిమా డైరెక్ట్ చేయాలనీ అనుకున్నప్పటి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. అందుకే స్క్రీన్ ప్లే కూడా ఐదుగురితో రాయించాను. ఎస్‌.కిర‌ణ్‌, స‌య్య‌ద్‌, ప్ర‌సాద్ కామినేని, సురేష్ ఆర‌పాటి, దివ్య‌భ‌వాన్ దిడ్ల స్క్రీన్ ప్లే అందించారు. దర్శకుడవ్వాలనుకునే రైటర్ కి , కొత్త దర్శకులకి నేను ఆదర్శం అవ్వాలి కానీ.. వారి ప్రయత్నానికి నేను అడ్డు అవ్వకూడదు. ఆ ఉద్దేశ్యంతోనే దర్శకుడిగా రాత్రి పగలు కష్టపడ్డాను. ఇంకా కొత్త దర్శకులు రావాలి. కొత్త కథలు రావాలి.


కంటతడి పెట్టని వారుండరు

సినిమా టీజర్, ట్రైలర్ చూసి ఇది కామెడీ సినిమా అనుకుంటున్నారు. కానీ సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది. ఈ ఎమోషన్ కి కంటతడి పెట్టని వారుండరు. బుర్రకథ నవ్విస్తూనే ఏడిపిస్తుంది. థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ పక్కా అన్నిరకాలుగా సంతృప్తి చెందుతారు. అది మాత్రం కచ్చితంగా చెప్పగలను.

 

ఇంకా డిసైడ్ అవ్వలేదు

నెక్స్ట్ సినిమా గురించి ఇంకా ఆలోచించలేదు. ‘బుర్రకథ’ రిలీజ్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలన్నది డిసైడ్ చేస్తాను.