డైరెక్టర్ అశోక్ ఇంటర్వ్యూ

Wednesday,January 24,2018 - 06:07 by Z_CLU

అశోక్ డైరెక్షన్ లో తెరకెక్కింది భాగమతి మూవీ. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా, ఇప్పటికే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈ డైరెక్టర్ అశోక్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకున్నాడు. అవి మీకోసం….

అలా జరిగింది

2012 సుకుమారుడు సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడే UV క్రియేషన్స్ కి ఈ స్టోరీ న్యారేట్ చేయడం జరిగింది.  వాళ్ళతో ఐడియా ఇలా షేర్ చేశానో లేదో, ఆ స్టోరీని వాళ్ళు ప్రభాస్ కి చెప్పమన్నారు. ప్రభాస్ వినగానే ఇంప్రెస్ అయిపోయారు… ఈ సినిమాని ఎలాగైనా ముందుకు తీసుకు వెళ్లాలని అన్నారు…

నాకలా ఉపయోగపడింది….

రుద్రమదేవి సినిమా తరవాత ఇమ్మీడియట్ ‘భాగమతి’ సెట్స్ పైకి రావాలి. కానీ రుద్రమదేవి లేట్ అయ్యేసరికి, అటు అనుష్కకు బాహుబలి డేట్స్ దగ్గర పడటంతో కుదరలేదు. లక్కీగా ఆ టైమ్ నాకు ప్రీ ప్రొడక్షన్ పై ఫోకస్ చేయడానికి పనికొచ్చింది. ముఖ్యంగా సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ భాగమతి బంగ్లా… సినిమా 70% ఆ బంగళాలోనే ఉంటుంది.

ఎందుకు భాగమతి…?

భాగమతి అనే పేరు హైదరాబాద్ కి సంబంధించింది కాదు, భాగమతి రివర్ ఉంది, మహారాష్ట్రలో కూడా భాగమతి పేరు చాలా ఫేమస్. పాత డైనాస్టీలలో చాలా మంది రాణుల పేరు భాగమతి అని ఉంది. నేపాల్ లో పెద్ద రివర్ ఉంది ఈ పేరు మీద. తరతరాలుగా భాగమతి అనే పేరుతో మనకు రిలేషన్ ఉంది.

డెస్టినీ అలా ఫిక్సయిందేమో…

బాహుబలి లాంటి సినిమా తరవాత అనుష్క తో ఈ సినిమా చేయడం డెస్టినీ అనుకుంటా… అందరికీ క్యూరాసిటీ ఉంది. దేవసేన తరవాత ఈ సినిమాలో భాగమతిలో ఎలా కనిపించబోతుంది అని. అలా సినిమా లేటయినా నాకు మంచే జరిగిందనే చెప్పాలి…

కన్వే చేయలేకపోతేనే సమస్య…

నేను ఎగ్జాక్ట్ గా ఏమనుకుంటున్నానో అది మీకర్థం అయ్యేలా నేను చెప్పలేకపోయానంటే అది నా ప్రాబ్లమే. సినిమా విషయంలోనూ అంతే… స్టోరీని సరిగ్గా కన్వే చేయలేకపోతే ఈజీగా ఫ్లాప్ అవుతుంది. అలాంటి తప్పులు భాగమతిలో జరగలేదు. కంపల్సరీగా సినిమా ప్రతి ఒక్కరిని రీచ్ అవుతుంది.

సినిమా సెట్స్ పైకి వచ్చాక కూడా….

సినిమా చాలా లార్జ్ స్కేల్ లో తీయడం జరిగింది. సెట్ దగ్గర నుండి, రోప్ వర్క్, గ్రాఫిక్స్ వరకు దానికి తోడు 4 K టెక్నాలజీ వాడాం. టైం టేకింగ్ అన్న క్లారిటీ బిగినింగ్ నుండే ఉంది. కాకపోతే పండక్కి రిలీజ్ అనుకున్నాం కుదరలేదు. అందుకే ఇప్పుడు వస్తున్నాం.

చాలా కష్టపడింది

మీరు ట్రైలర్ లో చూసిన ఆ ఒక్క షాట్ కోసం కోసం 2 రోజులు తను అలా ఆ చేయి పైకి పెట్టుకునే ఉండాలి. అదో రకం పనిష్మెంట్. అంతా అయ్యాక మేము షాట్ అద్భుతంగా వచ్చిందని ఓ వైపు హ్యాప్పీగా ఫీల్ అవుతూనే, అనుష్క ని ఎంతలా ఇబ్బంది పెట్టాం అనిపించింది.