మాస్ + ఫోక్ = దిమాక్ ఖరాబ్

Friday,June 07,2019 - 05:44 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఇస్మార్ట్ శంకర్ నుంచి సాంగ్స్ హంగామా మొదలైంది. కొద్దిసేపటి కిందట ఫస్ట్ సాంగ్ రిలీజైంది. దిమాక్ ఖరాబ్ అనే లిరిక్స్ తో సాగే ఈ పాట పక్కా మాస్, ఫోక్ స్టయిల్ లో ఉంది. ఇలాంటి పాటలకు పెట్టింది పేరైన కాసర్ల శ్యామ్, మరోసారి అదిరిపోయే లిరిక్స్ అందించగా.. మణిశర్మ ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు మాస్ బీట్ ఇచ్చాడు.

కీర్తన, సాకేత్ పాడిన ఈ పాట మాస్ బీట్ తో పాటు అక్కడక్కడ ఫోక్ స్టయిల్ లో కూడా సాగుతుంది. ఓవరాల్ గా రామ్ అభిమానులకు మాత్రం ఈ సాంగ్ ఓ పండగ కాబోతోంది. ఎఁదుకంటే ఎనర్జిటిక్ స్టార్ మామూలుగానే స్టెప్పులు ఇరగదీస్తాడు. ఇలాంటి మాస్ సాంగ్ పడితే రామ్ ను ఆపడం ఇక ఎవరితరం కాదు. మేకింగ్ లో ఆ విషయం
అక్కడక్కడ తెలుస్తూనే ఉంది.

ఈ సాంగ్ తో సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి. పూరి జగన్నాధ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వార్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చేనెల 12న ఇస్మార్ట్ శంకర్ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది.