కళ్యాణ్ రామ్ తో దిల్ రాజు సినిమా !

Sunday,March 01,2020 - 12:00 by Z_CLU

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో దిల్ రాజు నిర్మాణంలో ఒకటి. ఈ కాంబినేషన్ సినిమాకు గుహన్ దర్శకుడు. ఈ మధ్యనే వీరిద్దరి కాంబినేషన్ లో ‘118’ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది.

అందుకే ఈ కాంబో సినిమాను తన బ్యానర్ లో ప్లాన్ చేసుకున్నాడు దిల్ రాజు. ‘పటాస్’ నుంచి కళ్యాణ్ రామ్ – దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా నానుతూ వస్తుంది. ఎట్టకేలకు గుహన్ కథ నచ్చడంతో ఫైనల్ గా ప్రాజెక్ట్ సెట్టయింది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఈసారి కూడా గుహన్ థ్రిల్లర్ లో జోనర్ లోనే సినిమా చేస్తాడని సమాచారం.