రామ్ తో దిల్ రాజు సినిమా

Sunday,November 05,2017 - 09:50 by Z_CLU

ప్రెజెంట్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టేశాడు.. ఇటీవలే నేను లోకల్ తో సూపర్ హిట్ అందుకున్న త్రినాధ్ రావు నక్కిన తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు రామ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్  ఫైనల్ అయిందని, ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడని సమాచారం.

రామ్ తో ఆ మధ్య ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమా నిర్మించిన దిల్ రాజు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా నిర్మిస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ కథ-మాటలు అందిస్తున్నాడు. ప్రెజెంట్ ప్రి ప్రొడక్షన్ వర్క్ స్టేజి లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని టాక్.