Allu Arha - బన్నీ కూతురితో దిల్ రాజు సినిమా?

Saturday,July 10,2021 - 07:55 by Z_CLU

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోల కొడుకులు, కూతుర్లు ఏదోక వీడియో ద్వారా కనిపిస్తూ ఇప్పటి నుండే సెలెబ్ హోదా అందుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ కూతురు అల్లు అర్జున్ కూతురు సోషల్ మీడియాలో వీడియోస్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. మహేష్ కూతురు సితార అప్పుడప్పుడు యూ ట్యూబ్ లో కొన్ని వీడియోస్ తో ఆడియన్స్ పలకరిస్తుంటే ఆర్హ తన తండ్రితో కలిసి కొన్ని వైరల్ వీడియోస్ తో పాపులర్ అయింది.

allua arha ayan

అందుకే ఇప్పుడు ఆర్హ తో ఓ చైల్డ్ బ్యాక్ డ్రాప్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారట. దిల్ రాజు కాంపౌండ్ లో ఉండే సురేష్ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడని తెలుస్తుంది. ఆర్హ ఇటివలే ఓ మ్యూజిక్ వీడియోస్ లో నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోస్ చూశాక దర్శకుడు సురేష్ కి నిర్మాత దిల్ రాజు ఆర్హ తో సినిమా తీయాలనే ఆలోచన తట్టిందట.

ప్రస్తుతానికైతే ఈ సినిమాపై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం ఆర్హ తో సినిమా అనగానే వెంటనే ఓకె చెప్పేశారట. మరి ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేష్టలతో క్యూట్ గా కనిపించే ఆర్హ నిజంగా సినిమా చేస్తే అందులో ఎలా నటిస్తుందో? అని బన్నీ ఫ్యాన్స్ తో పాటు మిగతా వారు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాపై పూర్తి క్లారిటీ రానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics